అఖండ 2 వాయిదా.. నాకు జరిగిన అతి మంచి విషయం అదే.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బోయపాటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 వాయిదా పడడం.. ఫ్యాన్స్‌కు ఎలాంటి బిగ్‌షాక్‌ ఇచ్చిందో తెలిసిందే. మొదట ప్రీమియ‌ర్స్‌ ఆపేసిన మేకర్స్.. మరికొద్ది గంట‌ల్లోనే పూర్తి సినిమాను వాయిదా వేసేసారు. ఇవన్నీ గంటల వ్యవధిలోనే చక చకా జరిగిపోయాయి. దీంతో.. మేకర్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వర్షం కురిసింది. అయితే.. పరిస్థితులు అంతా తెలిసిన తర్వాత కూడా.. అయ్యో పాపం అనలేదు సరికదా.. ఇంకా దుమ్మెత్తి పోశారు. నందమూరి ఫ్యాన్స్.. అయితే తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే.. అఖండ 2 మేకర్స్‌ పేరు చెప్తే చాలు.. ఫ్యాన్స్ బూతులతో ఫైర్ అయిపోతున్నారు. ఇలాంటి క్రమంలో.. సినిమా విషయంలో ఫైనాన్స్ సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయని.. దాదాపు ఈ నెలలోనే సినిమా రిలీజ్ చేసేయాలని మేకర్స్‌ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే.. డిసెంబర్ 12, లేదా.. డిసెంబర్ 25న సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఇలాంటి క్రమంలోనే.. తాజాగా ప్రొడ్యూసర్ రామ్ అచంట చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ పోస్ట్ పై ఫ్యాన్స్ ఓ పక్కన ఫైర్ అవుతున్నా.. మరో పక్కన బాల‌య్య గొప్ప‌త‌నంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Akhanda 2 will be more than NBK-Boyapati combo film - producersఅసలు మ్యాటర్ ఏంటంటే.. అఖండ 2 నిర్మతల్లో ఒకరైన రామ్ అచంట.. బర్త్డే శనివారం జరగగా.. ఈ సందర్భంగా బాలయ్య తనకు స్వయంగా పుట్టినరోజు విషెస్ తెలియజేశారు అంటూ నిర్మాత సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ రోజు నాకు జరిగిన అత్యంత మంచి విషయం ఏదైనా ఉందంటే మా బాలయ్య గారు స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం.. ఈ కష్టకాలంలో ఆయన ఇచ్చిన ఆత్మవిశ్వాసం, మనోధైర్యం చాలా గొప్పది. ఈ సందర్భంగా నాకు మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ అంటూ పోస్ట్‌లో షేర్ చేసుకున్నాడు. నిలువెల్లా మంచితనంతో నిండిన హృదయం ఉన్న వ్యక్తి మీరు.. జై బాలయ్య అంటూ కృతజ్ఞతలు తెలియజేసాడు. దీంతో పాటే.. అతి త్వరలో అఖండ 2 మీ ముందుకు వస్తుందంటూ అనౌన్స్ చేశాడు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కుతుంది.