అఖండ 2నే ఈరోస్ టార్గెట్ చేయడానికి కారణం అదేనా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో సినిమా తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈరోస్‌కు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా వాయిదా వేస్తున్న క్రమంలో.. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా వాయిదా పడిపోయింది. అయితే.. అఖండ 2నే ఈరోస్‌ టార్గెట్ చేయడానికి గల కారణమేంటో.. ఇప్పుడు నెటింట‌ వైరల్‌గా మారుతుంది. చాలాకాలంగా ఆర్థిక వివాదం చెల్లరేగుతుంది.

చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసి నష్టాలు వచ్చాయంటూ.. పెద్ద లాభాలు రాలేద‌ని గతంలో చెప్పుకొచ్చిన 14 రీల్స్.. ఇప్పుడు బడ ప్రాజెక్టు రిలీజ్ టైంలోను బ‌కాయిలు తీర్చకుండా.. బుక్కాయిస్తుందని ఈరోస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 14 రీల్స్‌ ప్లస్ ప్రొడక్షన్ గత కొన్ని రోజులుగా తమ సినిమాల రిలీజ్ టైం లో ఈరోస్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిల గురించి ప్రశ్నించినా.. ప్రతిసారి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో పెద్ద సినిమా తీస్తున్నాం.. దాని ద్వారా వచ్చే లాభాలతో మీ అప్పు తీరుస్తావని హామీ ఇచ్చే వారిని వెల్లడించారు. చిన్న, మధ్య తరహా సినిమాలు ఆశించిన సక్సెస్ అందుకోలేదని.. తక్కువ లాభాలు మాత్రమే వచ్చాయని అప్పులు తీర్చకుండా వాయిదా వేస్తూ వచ్చారని వెల్ల‌డించారు.

EROS & 14 REELS COMPLETE ISSUE EXPLAINED - NTV Telugu

అఖండ 2 సినిమాకు మార్కెట్‌లో భారీ డిమ్యాండ్‌ ఏర్పడి.. బాగా బిజినెస్ జరిగడంతో.. ఈరోస్‌కు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారని భావించాం.. సినిమా రిలీజ్ కంటే ముందు నవంబర్ నెలలో తమ అప్పులు పూర్తిగా చెల్లించాలని 14 రీల్స్ ప్లస్ సంస్థను సంప్రదించం. అయితే.. 14 రీల్స్ చిత్తశుద్ధి చూపించకుండా.. మళ్ళీ ఏదో ఒక కారణంతో తప్పించుకొని.. ఈరోస్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారని.. దీంతో సంవత్సరాలుగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోనందుకు.. ఈరోస్ అఖండ 2ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. పెద్ద సినిమా రిలీజ్ టైం లో బాకీలను చెల్లించేందుకు చిత్తశుద్ధి చూపించకపోవడంతో.. తీవ్ర అగ్రహానికి గురైన ఈరోస్‌.. అందుకే కేవలం అఖండ 2 రిలీజ్ టైం లోనే న్యాయపరమైన చర్యలకు దిగారట.