సింహా, లెజెండ్, అఖండ లాంటి హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. డివోషనల్ టచ్.. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంబనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించడం మరో హైలెట్. ఈ క్రమంలోనే.. సినిమా సాంగ్స్ విషయంలో ఆడియన్ప్లో మొదటి నుంచి మంచి హైప్ మొదలైంది. ఇక.. ఇప్పటికే మూవీ నుంచి ఓ సాంగ్ రిలీజ్ అయినా.. ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌లో రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అఖండ 2 తాండవం నుంచి కొద్ది గంటల క్రితం అసలు సిసలైన లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు టీం. అదే హైందవం.
ఫస్ట్ పార్ట్ లోని అఖండ లానే ఇది కూడా.. కథలోని సోల్ పరిచయం చేసేలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఆధ్యాత్మికతను ఆవిష్కరిస్తూ.. పురాతన ఆలయ ప్రాంగణంలో అమ్మాయిలు పాడుతుండగా.. బ్యాగ్రౌండ్ లో అఖండ రూపంలో ఉన్న బాలయ్య నడుచుకుంటూ వస్తున్నట్లు వీడియోలో చూపించారు. ఇక థమన్ మ్యూజిక్ అంటేనే హెవీ బీట్స్ అని అంతా భావిస్తారు. కానీ.. ఈ సాంగ్ కాస్త కొత్తగా క్లాసికల్ టచ్ ఇస్తూనే.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. పూర్తిగా శాస్త్రీయ సంగీత ధోరణిలో మెలోడీయస్‌గా ఈ సాంగ్ కంపోస్ట్ చేశారు. సర్వేపల్లి సిస్టర్స్ ఈ పాటను పాడారు. వారి గొంతులో ఉన్న స్పష్టత, సాంప్రదాయ బద్ధమైన గానం పాటకు మరింత బలాన్ని చేకూర్చింది.
నాగ గురునాథ శర్మ రాసిన సాహిత్యం, సంస్కృత పదాలతో నిండి ఉన్న ఈ సాంగ్.. చాలా పవర్ ఫుల్ గా అనిపిస్తుంది. సనాతన ధర్మాన్ని ఆవిష్కరిస్తూ శివతాత్వాన్ని ప్రకృతి కి అర్థం పట్టేలా సాంగ్ డిజైన్ చేశారు. విజువల్స్‌లో బాలయ్య చాలా సీరియస్‌గా శివుడి ఆజ్ఞను ఆచరించే పవర్ఫుల్ అగోరగా కనిపించాడు. చేతిలో త్రిశూలం, మెడలో రుద్రాక్షతో ఫస్ట్ పాటను గుర్తు చేసే గెటప్‌లోనే ఉన్నప్పటికీ.. మరింత పవర్ఫుల్ లుక్ తో కట్టుకుంటున్నాడు. గ్రాఫిక్స్ వర్క్, టెంపుల్ సెట్టింగ్స్ వీడియోకు రీచ్నెస్ తెచ్చిపెట్టాయి. బోయపాటి మార్క్ ఎలివేషన్స్ లేకున్నా.. అఖండ పాత్ర ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సాంగ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక.. ఆఖండ ఫస్ట్ పార్ట్ సక్సెస్‌కి థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర వహించింది. ఇప్పుడు.. సీక్వెల్లో కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ ప్రధానంగా నిలువనుందట. అయితే.. ఈ హైందవం పాటను ఇన్స్టెంట్ ఛార్జ్ బస్టర్ అని చెప్పకపోయినా.. సినిమాలోని సందర్భానికి తగ్గట్టుగా సిచువేషనల్ సాంగ్ అని అనుకోవచ్చు. టీం మాత్రం ఈ సాంగ్ తో ప్రమోషన్స్‌లో డివైన్ టచ్ ఇచ్చేలా ప్రయత్నాలు చేసారు. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానున్న క్రమంలో ఈలోపే మరో పవర్ఫుల్ సింగల్ సినిమా నుంచి రిలీజ్ చేయనున్నారట.



