స్టార్ బ్యూటీ సమంత, డైరెక్టర్ రాజ్ నిడమోరు తాజాగా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్‌లో లింగభైరవ ఆలయంలో సోమవారం ఉదయం వీళ్లిద్దరు భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు.. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తర్వాత రాజ్, సమంతా తమ ఇన్స్టా ఖాతాలో పెళ్లి ఫోటోలను అఫీషియల్ గా షేర్ చేశారు. ఈ క్రమంలోనే అసలు సమంత – రాజ్ నిడమోరు మధ్యన పరిచయం ఎలా మొదలైందో.. అనే టాక్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇక రాజ్ నిడమోరుకు సమంతతో మొదటిసారి ఓ పెర్ఫ్యూమ్ యాడ్ లో పరిచయం ఏర్పడిందట. సినిమాల పరంగా మొదటిసారి ఈ జంట ఫ్యామిలీ మ్యాన్ 2తో కలిశారు.
2021లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక.. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో సిటాడెల్ హానీ బన్నీ వచ్చింది. ఇక తర్వాత తను సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ స్థాపించి.. నిర్మాతగాను మారింది. అందులో రాజ్ నిడమోరు కూడా ఓ భాగస్వామిగా చేశారు. ఆమె నిర్మించిన మొదటి సినిమా శుభంకు ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఇక నాగచైతన్యత విడాకులు తర్వాత కొంతకాలానికి సమంత.. రాజ్ నిడమోరులు కలిసి పబ్లిక్ లో కనిపించారు. వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఊహగానాలను అంతకంతకు పెంచుతూ.. ఇద్దరు కలిసి శుభం ప్రమోషన్స్లో తెగ సందడి చేశారు.
తర్వాత ఇద్దరు కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేయడం, సినిమాలు చూడడం, జిమ్‌కు వెళ్లడం, పండగలు కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం.. ఇలా ప్రతి మూమెంట్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వాదానాలకు మరింత బలం చేకూరింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. వివాహం చేసుకున్నారు. ఇక రాజ్‌కు సమంత కంటే ముందు 2017లో రచయిత శ్యామిలీ దేతో వివాహం జరిగింది. ఓంకార, రంగ్ దే బసంతి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆమె పనిచేసింది. ఏడేళ్ల వివాహ బంధం తర్వాత 2022లో వీళ్లు విడిపోయారు. ఇక సమంతకు కూడా ఇది రెండు వివాహమన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కినేని నాగచైతన్యతో 2017లో వివాహం కాగా.. అనుకోని కారణాలతో 2021లో ఈ జంట విడిపోయారు.



