ఇవాళ్లే సమంత రెండో పెళ్లి.. రాజ్ మాజీ భార్య షాకింగ్ పోస్ట్ వైరల్..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకమే అనడంలో అతిశ‌యోక్త‌తి లేదు. నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల త‌ర్వాత అమ్మ‌డు చాలా కాలం.. మయోసైటిస్‌తో పోరాడి.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక.. ప్రస్తుతం ఓ న‌టిగానే కాకుంగా.. పలు సినిమాలకు నిర్మాతగాను అమ్మడు రాణిస్తుంది. ఇక అమ్మ‌డి పర్సనల్ విషయానికి వస్తే.. నిర్మాత, దర్శకుడైన రాజ్ నిడమోరుతో కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతుందని.. వీళ్ళిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 1న పెళ్లి గ్రాండ్‌గా జరగబోతుందని.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా టాక్ వినిపించింది.

Samantha Ruth Prabhu To Marry Raj Nidimoru TODAY at Isha Yoga Center? Here's What We Know | Asianet Newsable

ఈ క్రమంలోనే ఇవాళ వీళ్ళిద్దరి పెళ్లి జరగబోతుందని.. అది కూడా సమంతకు ఎంతో ఇష్టమైన ప్లేస్ ను వీళ్ళ వివాహం కోసం ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే రాజ్ మాజీ భార్య చేసిన షాకింగ్ పోస్ట్ ఈ వార్తలకు ఊతం ఇచ్చినట్లు అయింది. ఇక ఇప్పటివరకు సమంత ఎక్కడ అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. ఈరోజు ఆమె పెళ్లి జరగబోతుందట‌. గత‌ కొద్దిరోజులుగా సమంత రూమర్డ్‌ బాయ్ ఫ్రెండ్ గా రాజ్ న‌డ‌మోరు తెగ వైరల్ గా మారుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా.. వీళ్ళిద్దరూ జంటగా కనిపించడం, క్లోజ్ గా ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడంతో వార్తలు మరింత వైరల్‌గా మారాయి. ముఖ్యంగా.. గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరూ వెకేషన్లను తెగ ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. కాగా.. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని సన్నిహితులు చెబుతున్నా.. రీసెంట్ గా మాత్రం సమంత.. రాజ్‌తో మరింత క్లోజ్ గా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

 

దీంతో సందేహం లేదని వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక సమంత.. రాజ్ వివాహం ఆమెకు ఎంతో ఇష్టమైన కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్లో జరగనుందని సమాచారం. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అటు సమంత గాని.. ఇటు రాజు కానీ క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి క్రమంలో.. రాజు నిడమోరు మొదటి భార్య శ్యామిలీ దే చేసిన పోస్ట్ సంచలనం సృష్టిస్తుంది. శ్యామిలీ దే తన సోషల్ మీడియా వేదికగా.. తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ ను షేర్ చేసింది. ప్రస్తుత ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో.. నిజంగానే సమంత, రాజ్ నిడ‌మెరు రెండో వివాహం చేసుకోబోతున్నారని.. అందుకే శ్యామిలీ దే ఇలాంటి పోస్ట్ షేర్ చేసిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్యామిలీ దే తన భర్తను తన నుంచి దూరం చేసింది అనే కోపంతో సమంతను ఉద్దేశించి బరితెగించి ఎలాంటి పనైనా చేసేస్తుందని అర్థం వచ్చేలా ఈ పోస్ట్ ను పంచుకుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.