టాలీవుడ్ ఇండస్ట్రీలోనే గాయత్రి గుప్తా ఓ సెన్సేషన్. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్ముడు.. అడపాతడపా సినిమాల్లో హీరోయిన్గా నటించినా.. ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో క్యారెట్ ఆర్టిస్ట్ గాను మెరిసింది. ఇక సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఫిదా సినిమాలో.. ఆమె ఫ్రెండ్ పాత్రలో నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా గాయత్రి గుప్తా.. తాను చేసిన కామెంట్స్ తోనే ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై తాను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి.
సినిమా అవకాశాల పేరుతో జరిగే మోసాల గురించి.. కొందరు అమ్మాయిల్ని ఎలా లొంగదీసుకుంటున్నారు అనే విషయం గురించి.. చాలా సందర్భాల్లో ఆమె కామెంట్స్ చేసింది. వాటితో పాటు కన్నతండ్రి పై కూడా ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తన తండ్రి తనను వేధించాడని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం మరోసారి అమ్మడు ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన గాయత్రి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

తనకు ప్రతిరోజు 12 హగ్గు కావాలని.. లేకపోతే అసలు నిద్ర పోలేనంటూ వివరించింది. అది కూడా అమ్మా,నాన్న, అక్క లేదా.. ఇలా ఎవరి నుంచి అయినా ఆ హాగ్స్ ఉండాలని.. ఒక 20 సెకన్లు నా శరీరానికి ఆ టచ్ లేకపోతే.. నేను నిద్రపోలేనని.. చెడు ఉద్దేశం లేని అలాంటి స్పర్శతో మనం సేఫ్ గా ఉన్నామని ఫీల్ వస్తుందంటూ చెప్పుకొచ్చింది. గతంలో నాకు ఇలాంటి ఫిజికల్ టచ్‌లు చాలానే దొరికేవి. కానీ.. ఇప్పుడు అంతా మారిపోయిందని.. టచ్ కాదు కద.. కనీసం మాట్లాడడానికి కూడా మనుషులకు టైం ఉండడం లేదంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


