వారణాసి ఈవెంట్ షాకింగ్ ఎఫెక్ట్.. రాజమౌళి పై కేసు నమోదు..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ వారణాసి. పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా సంబంధించిన అప్డేట్స్‌ను రాజమౌళి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశాడు. దీని కోసం గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ ను నిర్వహించాడు. ఇక ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్ వారణాసి అని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. వారణాసి ఈవెంట్‌తో రాజమౌళికి బిగ్ షాక్ తగిలిందట. అసలు మ్యాటర్ ఏంటంటే.. డైరెక్టర్ రాజమౌళి పై సూరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.

S.S. Rajamouli Faces Backlash For His 'I Don't Believe In God' Statement,  Netizens Are 'Shocked'

ఇటీవల జరిగిన ఈ ఈవెంట్‌లో హనుమంతుడు పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని.. రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా గ్లోబల్ ట్రోట‌ర్‌ ఈవెంట్ నిర్వహించిన రాజమౌళికి.. ఈ ఈవెంట్‌లో చిన్న సాంకేతిక లోపం తలెత్తడంతో.. గ్లింప్స్‌ స్ట్రీమింగ్‌కు అంతరాయం కలిగింది. అయితే.. రాజమౌళి ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ అయ్యాడు.

SS Rajamouli emotionally admits to feeling let down by Lord Hanuman at  Varanasi event: 'I don't believe in God but…' | Hindustan Times

తనకు దేవుడిపై నమ్మకం లేదని.. మా నాన్న నా దగ్గరకు వచ్చి హనుమంతుడు వెనకుండి నడిపిస్తాడని అంటున్నాడు.. ఇలా జరిగిన వెంటనే నాకు కోపం వచ్చింది. నా భార్యకు హనుమాన్ అంటే చాలా ఇష్టం.. ఆయనను తన స్నేహితుడిగా భావిస్తుంది. నా భార్య మీద కూడా కోపం వస్తుంది.. ఇలానేన ఆయన చేసేది అనిపించింది అంటూ కామెంట్స్‌ చేశాడు. ఇక‌ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఇది వివాదానికి దారితీసింది. ఇందులో భాగంగానే ఆయన కామెంట్స్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ కేసు నమోదు చేశారు.