ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరి దృష్టి మహేష్ బాబు, రాజమౌళి కాంబో పైనే ఉంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న గ్లోబల్ ట్రోటర్‌పై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొద్ది గంటల్లో.. ఈ సినిమా నుంచి స్ట్రాంగ్ అప్డేట్స్ రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్స్1పై ఆడియన్స్‌లో అదుర్స్ రెస్పాన్స్ దక్కింది. దీంతో సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ.. ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. జక్కన్న గ్లోబల్ ట్రోటర్ ఈ నెల 15న ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే.. ఈవెంట్లో జక్కన్న ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడని ఆసక్తి అందరిలోను మొదలైంది.
ఇక.. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా మెరవనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రియాంక తెలుగులో నటించిన మొదటి సినిమా గ్లోబల్ ట్రోటర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. ఈ సినిమా కంటే ముందే ప్రియాంక మరో తెలుగు సినిమాలో నటించిందట. ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఓ సినిమాలో నటించిన.. ఆ మూవీ ఏదో.. ఆ ఇద్దరు హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. 2002లో తమిళ్ ఇండస్ట్రీలోకి ప్రియాంక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అదే టైంలో తెలుగులోను ఓ సినిమాలో నటించింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. అపురూపం. ఈ సినిమాలో మధుకర్, ప్రసన్న కుమార్ ఇద్దరు ప్రధాన పాత్రలో మెరిశారు.

జి.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా షూట్.. చాలా వరకు కంప్లీట్ అయిపోయిందట. కానీ.. అనుకోని కారణాలతో సినిమా రిలీజ్‌కు ముందే ఆగిపోయింది. ఇక.. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ప్రియాంకా.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా మారింది. అయితే.. రామ్ చరణ్‌తో కలిసి ప్రియాంక బాలీవుడ్ లోనే జంజీర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. కాగా.. ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 తో మరోసారి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక మందాకిని రోల్లో కనిపించనుంది. ఇప్పటికే.. అమ్మడి ఫస్ట్ లుక్‌ను రాజమౌళి రివిల్ చేయగా.. ఆ పోస్టర్ నెటింట తెగ వైరల్‌గా మారుతూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.

