నందమూరి కుటుంబం నుంచి మూడవతరం హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీఇచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య తనయుడుగా ఎప్పటికే భారీ క్రేజ్ సంపాదించుకున్న మోక్షజ్ఞ.. తన సినీ ఎంట్రీ విషయంలో మాత్రం ముందుకు కదలడం లేదు. అసలు ఈ ల్యాగ్ ఎందుకో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. రోజురోజుకు తన నుంచి వచ్చే సినిమా లేట్ అయిపోతున్న క్రమంలో.. ఆడియన్స్ సైతం సినిమా గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు. జనం గతంలో.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినా.. అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ప్రశాంత్ వర్మ సైతం సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
బాలయ్య మరొక దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించాలని ప్రయత్నంలో ఉన్నట్లు టాక్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. కాగా.. కొన్ని రోజులుగా కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపించినా.. అది కూడా వర్కౌట్ కాలేదట. దీంతో.. ఇప్పుడు బాలయ్య తన ఆ స్థాన డైరెక్టర్‌ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే బాలయ్య.. క్రిష్ డైరెక్షన్‌లో మూడు సినిమాలు చేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి, కథానాయకుడు, మహానాయకుడు. ఈ మూడు సినిమాల్లో గౌతమీపుత్ర మంచి సక్సెస్ అందుకోగా.. మిగతా రెండు డిజాస్టర్లుగా నిలిచాయి.
అయినా.. కొడుకు మోక్షజ్ఞను క్రిష్ చేతిలో పెట్టడం వెనుక ఓ బలమైన కారణమే ఉందట. మోక్షజ్ఞ అయితేనే క్రిష్ ఫస్ట్ సినిమాకు న్యాయం చేయగలరని బాలయ్య స్ట్రాంగ్ గా నమ్ముతున్నాడని.. తనైతే సెన్సిబుల్ కాన్సెప్ట్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేయగలరని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం. వైవిద్యంగా మోక్షజ్ఞను ఆడియన్స్‌కు చూపించడంలో క్రిష్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని.. ఆయనను రంగంలోకి దించుతున్నాడట బాలయ్య. రీసెంట్‌గా కృష్ డైరెక్షన్‌లో వచ్చిన ఘాటి ఊహించిన సక్సెస్ అందుకోలేదు. దీంతో.. ఆయన మార్కెట్ డౌన్‌లో ఉంది. ఈ క్రమంలోనే క్రిష్ సైతం మోక్షజ్ఞతో సినిమా చేసి తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తాడా.. లేదా.. వేచి చూడాలి.



