పవన్ ‘ OG ‘ స్టోరీ నా మూవీ నుంచి తీసుకున్నారు.. కన్నడ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్‌ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సిఎం.. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఓజీ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించిందో.. ఎంతలా రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా.. పవన్ అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌కు సైతం గూస్‌బంప్స్ తెప్పించింది.

ఇక.. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. కన్నడ డైరెక్టర్ ఆర్. చంద్రు.. ఈ సినిమా గురించి రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆర్.చందు మాట్లాడుతూ.. తన కబ్జా సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఓజీ సినిమా తెరకెక్కిందంటూ షాకింగ్ ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారానికే దారితీసాయి. కబ్జా ఓ సాధారణ సినిమాగా నిలిచింది. ఇక‌ ఓజీ స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కి భారీ సక్సెస్‌ను అందుకుంది.

Director R. Chandru clarifies the 'Kabzaa' lead actress discussion, says  that all ongoing reports are far from the truth | Kannada Movie News -  Times of India

ఈ క్రమంలోనే.. అసలు ఆ సినిమాకు.. ఈ సినిమాలో పవర్ స్టార్ స్టైల్, ఎలివేషన్, స్టోరీ కి పోలికే ఉండ‌దంటూ.. సుజిత్ స్టోరీ స్కిల్స్,, డైరెక్ష‌న్ టాలెంట్ ఈ సినిమాలో క్లియర్ కట్‌గా అర్థమవుతున్నాయంటూ తెలుగు ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కన్నడ డైరెక్టర్ చేసిన కామెంట్స్‌.. సినిమాపై మరింత చర్చకు దారి తీసాయి. ఈ క్రమంలోనే ఓజీ సినిమా ఓటీటీ రిలీజ్ పై కూడా ఆడియన్స్ లో మరింత హైప్‌ పెరుగుతుంది.