నయనతార ఫ్యామిలీకి చిరు స్పెషల్ గిఫ్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చిరంజీవి ఈ వయసులోనూ వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన తోటి సెలబ్రిటీలతోను మంచి స్నేహ బావాని చూపిస్తూ అందర్నీ గౌరవిస్తూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనతో పనిచేసే ప్రతి ఒక్క నటీనటులు ఎప్పుడు చిరుకి.. చేరువలో వుంటారు. ముఖ్యంగా 80స్‌ నట్టినట్టులతో గెట్ టు గెదర్ పార్టీలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నాడు చిరు. ఇటీవల.. తమతో కలిసిన నటించిన న‌టులను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి మరీ వారి కోసం స్పెషల్ గిఫ్ట్‌ల‌ను కూడా అందించిన సంగతి తెలిసిందే.

దీపావ‌ళి సెలబ్రేషన్స్ లో భాగంగా తన తోటి సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ అందరినీ ఆహ్వానించడం.. ముఖ్యంగా ఆయన నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాల్లో భాగమైన నయనతార కుటుంబంతో పాటు.. వెంకటేష్‌, అలాగే ఆయన క్లోజ్ ఫ్రెండ్ నాగార్జున ఫ్యామిలీ లను కూడా ఇంటికి పిలిచాడు చిరంజీవి. ఇక.. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగానే.. నయనతార దంపతులకు చిరంజీవి చిన్న స్పెషల్ గిఫ్ట్ ఇవ్వ‌టం తెగ వైరల్ గా మారుతుంది. ఆ గిఫ్ట్ తోనే వారిపై ఉన్న ఇష్టాన్ని చిరంజీవి చాలా అందంగా చూపించాడు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కుటుంబంతో నయనతార ఫ్యామిలీ కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.

ఇంతకీ నయనతార ఫ్యామిలీకి చిరంజీవి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ మారేదో కాదు.. దుర్గాదేవి ప్రతిమ పొదిగి ఉన్న అందమైన శంఖం. నయనతార దంపతులకు చిరు గిఫ్ట్ గా ఇచ్చాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. నయనతార సైతం ఈ పిక్స్ ను తన ఇన్స్టావేదికగా షేర్ చేసుకుంది. ఈ ఫోటోలతో పాటు.. ఈ ఏడాది దీవాలి చాలా భిన్నంగా అనిపించింది. వెచ్చదనం, ప్రేమ, నా చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎన్నడు ఊహించని కొత్త ఇంటిని కనుగొన్న. ఎన్నడు అనుభవించిన సరికొత్త‌ అనుభూతిని పొందుతున్న.. ముఖ్యంగా ఓవెలుగు ఎప్పుడు మన చుట్టూ ఉండాలని కోరుకుంటున్న అంటూ నయనతార అందరికీ దీపావళి విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం న‌య‌న్ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక గతంలో కూడా చిరంజీవి ఇలాంటి బహుమతినే శ్రీలీలకు ఇచ్చి ఆమె ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అలా.. చిరంజీవి తన ఇంటి ఆడపడుచులుగా భావించి.. తనకు నచ్చిన వ్యక్తులకు బహుమతిగా ఇవి అందిస్తూ తెగ వైరల్ గా మారుతున్నారు. ముందు ముందు చిరంజీవి ఇదే బహుమతిని ఎవరికి ఇస్తారు.. వేచి చూడాలి.