టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నిలవనుంది. ఇప్పటికే బాలయ్య వరుసగా నాలుగు సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని.. ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వల్గా అఖండ 2 తాండవంలో నటిస్తుండడంతో.. సినిమా పై ఆడియన్స్ లో హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది. ఇప్పటికే.. షూటింగ్ తుది దశకు చేరుకుందట. ఇక సినిమా మ్యూజిక్ విషయంలో థమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అఖండ రికార్డులు బద్దలయ్యేలా అఖండ 2 సంచలనం సృష్టించడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి క్రమంలో.. సినిమా సెకండ్ హాఫ్‌కు సంబంధించిన టాక్ వైరల్‌గా మారుతుంది. అఖండ 2 సనాతన ధర్మాన్ని గురించి వివరిస్తూ.. మాస్ యాక్షన్ డివోషనల్ స్టోరీగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. అఖండ 2లో వచ్చే సెకండ్ హాఫ్ సీన్స్ నెవర్ బిఫోర్ రేంజ్లో ఉండనున్నయట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై చూడని రేంజ్లో ఈ సినిమాలోని సీన్స్ రూపొందించినట్లు మూవీ యూనిట్ వివరిస్తున్నారు. ఇక.. ఇటీవల కాలంలో ఓ సినిమాకు అది కూడా సీనియర్ హీరో సినిమాకు హీరోయిన్ అవ్వడం అంటే.. సాధారణ విషయం కాదు.
సాధారణంగానే బాలయ్య డివోషనల్ యాక్షన్ సినిమాలంటే ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఈ క్రమంలోనే అఖండ 2కు కూడా 100% ఎఫర్ట్స్ పెట్టి మరి పనిచేసాడంటూ టాక్ నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఎంతో ఆసక్తిగా కొనసాగుతుందని.. విజువల్ వండర్ గా ఆడియన్స్‌ను పలకరించనున్నట్లు సమాచారం. సినిమా చూస్తున్నంత సేపు సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుందని.. ప్రతి ఆడియన్స్ హార్ట్ టచ్ చేసే రేంజ్లో సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. బోయపాటి ఏ రేంజ్లో అయితే కాన్సెప్ట్‌లో సీన్స్ ను సిద్ధం చేస్తాడు.. అంతకుమించిపోయి హైలైట్ అయ్యేలా థమన్ మ్యూజిక్ ప్లాన్ చేస్తున్నాడని.. సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్‌కు ట్రీట్ ఖాయం అంటూ తెలుస్తుంది.