మాతో పెట్టుకుంటే మీకే బొమ్మ చూపిస్తాం.. పోలీసులకు ibomma సవాల్..!

తాజాగా పైరేటెడ్ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం ఏ రేంజ్లో వైరల్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆ వ్యవహారం మరింత ముదిరినట్లు అనిపిస్తుంది. ఇప్పటివరకు.. సినీ నిర్మాతలు, హీరోలను బెదిరిస్తూ ఐబామ్మ సైట్ నిర్వాహకులు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాలు విసరడం హాట్ టాపిక్‌గా మారింది. తమపై దృష్టి సారిస్తే రివర్స్ యాక్షన్ తప్పదంటూ ఓ నోట్‌ ద్వారా వార్నింగ్ ఇవ్వడం సెన్సేషన్ సృష్టిస్తుంది. 65 పైరసీ వెబ్సైట్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పీరియాదులను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి పైరసీ ముఠాను పట్టుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ఈ విషయాన్ని మీడియా వేదికగా వెల్లడించారు. పైరసీ కారణంగా 2024 లోనే తెలుగు సినీ పరిశ్రమకు సుమారు రూ.3.700 కోట్లపైగా భారీ నష్టం వాటిల్లందని.. ఐబొమ్మ లాంటి సైట్లను ఎంత టెక్నాలజీ వాడి సినిమాలు రిలీజ్ చేసినా వదిలి పెట్టేది లేదంటూ.. అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని కచ్చితంగా పట్టుకుని తీరుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఐ బొమ్మ వాళ్లకు రివర్స్ వార్నింగ్ ఇస్తూ రిలీజ్ చేసిన నోట్ తెగ వైరల్ గా మారుతుంది. ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేసి చూపిస్తాం.. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్‌ తీసిన వాళ్లపై కాకుండా.. మీ ఓటీపీ రెవెన్యూ కోసం ఆలోచించి మాపై ఫోకస్ చేస్తున్నారు.

హీరోలకు ఆరెంజ్ రెమ్యూనరేషన్‌లు అవసరమా.. అది మీ కొడుకు అయినా మరి ఎవరైనా.. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు.. వాళ్లంతా ఏమైపోతారు అని మీరు చెప్పకండి.. వాళ్లకు మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా కూడా వచ్చేస్తాయి. కానీ.. మీ హీరోకి, హీరోయిన్ కి అరేంజ్ లో వస్తాయా. సినిమా బడ్జెట్లో ఎక్కువ రెమ్యూనరేషన్ మరియు విదేశాల షూటింగ్ ల కోసం ట్రిపుల కోసమే వాడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్ వరకు మీరు పెట్టే ఖర్చు ఎంత.. ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ భారీగా తగ్గుతుంది కదా.. అక్కడ వాళ్ళకి ఉపాధి కూడా కలుగుతుంది కదా.. మరో పాయింట్ అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీ కోసం దాన్ని మాపై రుద్దడం డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్ ఓనర్లు ఆ అమౌంట్‌ని కలెక్ట్ చేసుకోవాలని.. టికెట్ రేట్ పెంచి దాన్ని మా పై రుద్దడం చివరకు మధ్యతరగతి వాడే బాధపడాలి.. మా వెబ్సైట్లోపై ఫోకస్ చేయడం ఆపేసేయండి.. లేదంటే మేము మీ పై ఫోకస్ పెట్టాల్సి వస్తుంది.

ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్ రిలీజ్ చేసే వెబ్సైట్లో మీద మీ దృష్టి పెడితే మంచిది. ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి.. ఈ – సిగరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ మాత్రమే. మీ యాక్షన్స్ కి.. నా రియాక్షన్ ఉంటుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. ఈ మిడిల్ లో వేరే ఏ హీరో కూడా (ఎగ్జాంపుల్ విజయ్‌) టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి దానిని తొలగిస్తున్నం. ఇప్పుడు ఇమీడియట్ డిలీట్ చేస్తే మీకు భయపడి.. లేదా మీరు తీయించినట్లు భావిస్తారు. అందుకే.. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసేయాలని ఫిక్స్ అయ్యాం.

ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరుకున్నాము. దానికి వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్లు కూడా షేర్ చేయట్లేదు. కానీ.. మేం ఐబొమ్మ . నెట్ వాళ్లంతా మంచి వాళ్ళమైతే కాదు. బురదలో రాయి వేయకండి అది కూడా పెంటపై అసలు వేయొద్దు.. మేము ఏ దేశంలో ఉన్నా.. భారతదేశం అందులో తెలుగు వాళ్ళ కోసమే ఆలోచనలు చేస్తాం. చావుకు భయపడని వాడు దేనికి భయపడడు. నేరాలు చేసేవాళ్లను వీక్షించేది లేదంటూ వార్నింగ్ ఈచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులకు నేరుగా సవాలు విసురుతూ.. ఐ బొమ్మ ఈ నోట్ రిలీజ్ చేసింది. ఈ వ్యవహారాన్ని సజ్జనర్ ఎంత సీరియస్ గా తీసుకుంటాడో చూడాలి.