బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే.. ఇటీవల టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కల్కి సినిమాతో ఇక్కడే ఆడియన్స్‌ను సైతం మెప్పించిన ఈ అమ్మడుకు.. సౌత్ ఇండస్ట్రీలో చుక్క ఎదురయింది. టాలీవుడ్ మేకర్స్ దీపికకు షాక్‌లపై షాక్‌లు ఇస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల కల్కి 2 నుంచి దీపికను తప్పించినట్లు వైజయంతి బ్యానర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలో తాజాగా మరోసారి దీపిక ఓ బడా పాన్ ఇండియన్ టాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందంటూ టాక్ నడుస్తుంది. అదే అల్లు అర్జున్ ప్రాజెక్ట్. దీపిక.. AA22 నుంచి కూడా తప్పుకుందంటూ నిర్మాతలు షాక్ ఇచ్చారు. ఇక గతంలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబో స్పిరిట్ సినిమా నుంచి సైతం దీపికను తప్పించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె సినిమాల్లో నటించడానికి పెడుతున్న కండిషన్స్ నచ్చక మేకర్స్ సినిమాలు నుంచి తప్పించినట్లు సమాచారం.
ఇప్పుడు ఏఏ 22 ప్రాజెక్టు నుంచి సైతం దీపికను తప్పించాలని డైరెక్టర్ అట్లి.. నిర్మాతలను స్వయంగా కోరాడట. కారణం ఆమె మితిమీరిన కోరికలను తెలుస్తోంది. మొత్తంగా భారీ ప్రాజెక్టులో నుంచి దీపిక వరుసగా తప్పకుంఠష్ట్ర ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఆమె పెట్టే తిక్క కండిషన్స్ కు ముందు ముందు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయా.. లేదంటే కేవలం నార్త్ సినిమాలతో సరిపెట్టుకుంటుందా వేచి చూడాలి.