వార్ 2 దెబ్బకు కూలి ఢమాల్.. ఫస్ట్ డే కలెక్షన్స్‌లో…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొద్ది గంటల్లోట బెస్ట్ ఫైట్ మొదలుకానుంది. వార్ 2 వర్సెస్ కూలీ సినిమాల మధ్యన కాంపిటీషన్ ఆడియన్స్‌ అందరిలోనూ పీక్స్ లెవెల్‌లో హైప్‌ నెల‌కొంది. భారీ బడ్జెట్‌లో భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ రెండు సినిమాలపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో ఇరు సినిమాలు ఓపెన్ బుకింగ్స్ ప్రారంభమై స‌త్తా చాటుతున్నాయి. ప్రెజంట్ ఉన్న టాక్ ప్రకారం వార్ 2 కంటే.. ఎక్కువగా కూలి సినిమా కలెక్షన్‌ల‌తో సత్తా చాటుకుంటుందని చెబుతున్నారు.

కానీ.. ఇలాంటి క్రమంలో కూలి సినిమాకు ఓ ఏరియాలో భారీ దెబ్బ తగలనుందని సమాచారం. అది మరెక్కడోకాదు వార్ 2 మూవీ రీజనల్ ఏరియా అయినా బాలీవుడ్ లో. కూలి సినిమా పై భారీగా ఎఫెక్ట్ పడనుందని.. ఓ మీడియా సంస్థ వివరించింది. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న వార్ 2.. మొదటి రోజు కేవలం హిందీలోనే రూ.37 కోట్ల వసూలు చేసే అవకాశం ఉందట. అలాగే.. కూలీ సినిమాకు మొదటి రోజు హిందీలో కేవలం రూ.5 నుంచి ఐదున్న‌ర‌ కోట్ల వరకు మాత్రం వసూళ్లు వస్తాయని.. ఆ మీడియా పేర్కొంది.

హృతిక్ ప్రధాన పాత్రలో నటించిన క్రమంలో.. వార్ 2 సినిమాకు హిందీలో భారీ డిమాండ్ నెల‌కొంది. ఈ క్రమంలోనే అక్కడ ఎక్కువ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ఆ మీడియా సంస్థ ప్రస్తావిస్తూ వార్ 2 దెబ్బకు అక్కడ కూలి ఢ‌మాల్ అయిపోతుందంటూ వివరించింది. అంతేకాదు.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్‌ డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు రూ.12 కోట్లు.. హిందీలో వసూలు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. ఆ మీడియా వివరించింది.