సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత.. సెకండ్ మ్యారేజ్ పిక్స్ వైరల్..!

కేవలం టాలీవుడ్ కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. సమంత రెండో పెళ్ళికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. సమంత రెండో పెళ్లికి టైం రానే వచ్చేసింది అంటూ.. ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సమంత పెళ్లికూతురుగా మెరిసిన ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే.. ఫోటోలు చూసినా చాలా మంది నెటిజ‌న్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. మొదట నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత.. కొంతకాలానికి ఆయనతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య డివోర్స్ తర్వాత ఎన్నో కష్టాలను అధిగమించిన సమంత.. మయోసైటిస్‌ను సైతం ఓడించి స్ట్రాంగ్ గా నిలబడింది.ఇక‌ మయోసైటీస్ తర్వాత అమ్మడు టాలీవుడ్ లో తాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శుభం సినిమాలో మాత్రమే నటించింది.

అయినా సమంతకు ఉటాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో రక్తబండార్ సిరీస్‌తో పాటు.. మరో టాలీవుడ్ ప్రాజెక్ట్ మా ఇంటి బంగారం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ అమ్మడు.. మా ఇంటి బంగారం సినిమాకు తానే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే అమ్మ‌డికి ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు మరింతగా పెరిగాయి. అయితే.. గత కొద్ది రోజులుగా సమంత ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక.. నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత ఈ వార్తలకు మరింత జోరు పెరిగింది. సమంత తన రూమర్డ్‌ బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఆ వార్తలను నిజం అనేలా సమంత.. రాజ్ నిడమోరుతో తెగ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. ఇక రాజ్ నిడమర్రు మొదటి భార్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండేది కాదు. అయితే.. సమంతతో రాజ్‌ డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. ఆమె సైతం సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్టులను షేర్ చేస్తూ.. వారి రిలేషన్ పై కామెంట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే సమంత నిజంగానే రాజ్‌ను రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ అభిప్రాయాలు నెటిజెన్‌ల‌లో వెలువ‌డుతున్నాయి. ఇలాంటి క్రమంలో.. తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. అచ్చం పెళ్లికూతురు గెటప్‌లో సమంత.. తన స్మైలీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. దీంతో సమంత రెండో పెళ్లికి సిద్ధం అయిపోయిందని.. త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ.. అందుకే ఇలా పెళ్లికూతురు లా ముస్తాబై ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సమంత ఈ పెళ్లి కూతురు గెటప్ రెండో పెళ్లి కోసమేనా.. లేదా ఏదైనా సినిమా ఫోటోషూటా తెలియాల్సి ఉంది.