అక్కినేని యంగ్ హీరో అఖిల్ తాజా గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్ .. ప్రస్తుతం ఎంతో వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది .. ఇక ఈ సినిమా ను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తుండ గా పక్క రూరల్ డ్రామా గా ఈ సినిమా ని తీసుకువస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా లో ముందుగా హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీ లీల ను ఓకే చేయగా .. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి పక్కకు వెళ్లిపోయింది .. ఇక ఇప్పుడు ఆమె స్థానం లో మరో బ్యూటీ భాగ్యశ్రీ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది .అదే విధంగా ఈ సినిమా షూటింగ్ కోసం భాగ్యశ్రీ ఎంతో తీవ్రంగా శ్రమిస్తుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కంటే ముందే భాగ్యశ్రీ పలు సినిమాలు నటిస్తూ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే .. మరో యంగ్ హీరో రామ్ కు జంట గా ఆంధ్ర కింగ్ తాలూకా, మరో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తో కాంత వంటి క్రేజీ సినిమాల్లో ఈమె నటిస్తుంది .. ఇలా లెనిన్ తో పాటు ఈ మూడు సినిమాల షూటింగ్ కోసం భాగ్యశ్రీ ఒక సెట్ నుంచి మరో సెట్ కు చక్కర్లు కొడుతుంది .. ఇదే క్రమంలో లెనిన్ సినిమా లో ఆమె పాత్ర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో అనేది కూడా ఎంతో ఆసక్తిగా మారింది ..
అఖిల్ లెనిన్ కోసం కష్టపడుతున్న భాగ్యశ్రీ .. గట్టిగానే తిరుగుతుందిగా..!
