కుబేర సక్సెస్‌తో తారక్‌కు కొత్త తలనొప్పి షురూ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ హీరో సినిమా హిట్ అయితే చాలు.. వెంటనే సోషల్ మీడియా జనాలు కాచుకుని కూర్చుంటున్నారు. మిగతా స్టార్ హీరోలను ఎలా ట్రోల్ చేయాలని టార్గెట్ చేసి మరి నెగటివ్గా వాళ్లను హైలెట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఇండస్ట్రీలో అదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కుబేర స‌క్స‌స్.. తారక్ ట్రోలింగ్‌కు కార‌ణం అయ్యింది. ఈ సినిమా హిట్ అవడానికి.. ఎన్టీఆర్‌ను టోల్ చేయడానికి మధ్యన లింక్ ఏంటి అనుకుంటున్నారా.. ధనుష్ కోలీవుడ్ స్టార్ హీరో.. అక్క‌డి నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడమే కాదు.. టాలీవుడ్ డైరెక్టర్లను సినిమాలను ఎంచుకుంటూ సూపర్ డూపర్ హిట్లు అందుకుంటున్నాడు. తెలుగు జనాలతోనే శ‌భాష్ అనిపించుకుంటున్నాడు.

Feeling proud to have made Kubera – Shekar Kammula

ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్ లో నటించేందుకు అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటనతో తన సత్తా చాటుకుంటున్నాడు. కానీ.. ఎన్టీఆర్ మాత్రం ఎందుకు అలాంటి స్పెషల్ రోల్‌లో మెరువలేకపోతున్నాడనేది ఇప్పుడు నెటింట‌ వినిపిస్తున్న వాదన. తెలుగు ఇండస్ట్రీ లోనే పుట్టి పెరిగిన ఎన్టీఆర్.. బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ స్పెషల్ రోల్‌ చేస్తూ.. అక్కడ మార్కెట్‌ క్రియేట్ చేసుకోవడానికి చూస్తున్నాడు. కానీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎప్పుడూ ఒక్క స్పెషల్ రోల్‌లో కూడా నటించిందే లేదు. ధనుష్ కుబేర సినిమా కోసం ఏకంగా బిచ్చగాడు రోల్‌లో చేసేందుకు కూడా ఓకే చెప్పి తన సత్తా చాటుకున్నాడు. కానీ.. ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి వినూత్నమైన రోల్‌లో ఎప్పుడు తెలుగులో నటించిన లేదు అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Jr NTR Joins Sets of NTRNeel: Shoot Begins THIS Date

ఇక‌.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ట్రోల్స్‌కు చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. తార‌క్ అన్నకు అలాంటి పాత్ర వస్తే.. కంటెంట్ వర్క్ అవుట్ అవుతుందని పిస్తే కచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తాడు. కానీ.. ఆయనకు అసలు అలాంటి పాత్రలే రాకపోవచ్చు.. ఈ కారణంగానే ఆయన అలాంటి సినిమాల్లో నటించకపోవచ్చు.. అంతేకాదు ఎన్టీఆర్ బిచ్చగాడు రోల్ కాకున్నా.. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి తన సత్తా చాటుకున్నాడు. అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.