క్లీంకార సెకండ్ బర్త్ డే.. ఆ పులి పిల్లది కూడా నా కూతురు పేరే.. ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

మెగా ప్రిన్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లింకార రెండో పుట్టినరోజు నేడు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు ఉపసనా, చరణ్. ఈ క్రమంలోనే క్లింకార‌.. తల్లి ఉపాసన క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్‌ను షేర్ చేసుకుంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో తన పేరుతోనే ఉన్న ఓ పులి పిల్లను క్లీంకార కలిసిందని.. ఈ విషయం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చిందంటూ ఉపాసన తన పోస్టులో షేర్ చేసుకుంది. గతంలో ఈ పులిపిల్ల‌ను చ‌రణ్‌, ఉపాసన దంపతులు దత్తత తీసుకున్నారు.

Upasana introduces the world to Klin Kaara's namesake and birthday twin — a  baby tigress! - Hindustan Times

ఇప్పుడు దానికి వీళ్ళు కూతురు క్లింకార పేరులో పెట్టడం విశేషం. 2012లో చరణ్ – ఉపాస‌న‌వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే కెరీర్లో పనులతో బిజీగా ఉన్న ఈ జంట.. దాదాపు 11 ఏళ్ల తర్వాత జూన్ 20న ఓ ఆడపిల్లకు జన్మనిచ్చారు. తనే క్లింకార. అప్పటినుంచి మెగా ఫ్యామిలీలో అల్లరి ముద్దుగా పెరుగుతున్న క్లింకారా ఫొటోస్.. ఇప్పటివరకు ఎన్నో పోస్టులలో షేర్ చేసుకున్న చ‌ర‌ణ్, ఉపాస‌న‌. అయితే ఎక్క‌డ‌ ఫేస్ మాత్రం రిపీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు.

Ram Charan-Upasana Konidela daughter Klin Kaara meets her namesake tigress  on 2nd birthday - India Today

ఇక.. గతంలో చరణ్‌ దంపతులు దత్తత తీసుకున్న ఈ పులిని హైదరాబాద్ జూ.. అధికారులు మెగా డాటర్ గౌరవార్థంగా క్లీంకార అని నామ‌క‌ర‌ణం చేశారు. ఇక చ‌ర‌ణ్ దంన‌తులు..తాజాగా దాన్ని ప్రత్యక్షంగా క్లింకార‌కు చూపించారు. ఇక ఏడాది క్రితం ఓ పసికొనగా ఉన్న ఈ పులిపిల్ల ఇప్పుడు శివంగిలా మారి క్లింకార‌ పేరును పెట్టుకోవడంతో స్పెష‌ల్‌గా నిలిచింది. ఇక క్లింకర తన పేరుతో ఉన్న పులిని తొలిసారి కలవడంపై ఉపాసన ఒక క్యూట్ పోస్ట్లు షేర్ చేసుకుంది. జూ. నిర్వహకులకు థాంక్స్ చెప్తూ.. కృర‌మృగాలు అడవిలో ఉండాలి.. కానీ అవి గౌరవంతో బతకాలి.. అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చింది. ఇప్పుడు ఆమె చేసిన ఈ పోస్ట్ మెగా అభిమానుల్లో మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే పోస్ట్‌ను తెగ ట్రెండ్‌ చేస్తూ.. క్లీంకారకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు మెగా ఫ్యాన్స్.