సినీ ఇండస్ట్రీలో.. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కించి.. బ్లాక్ బస్టర్లు కొట్టే దర్శకులు ఎంతమంది ఉన్నా.. వారిలో కొంతమందికి మాత్రమే ఒక ప్రత్యేకమైన గ్రేస్, పాపులారిటీ ఉంటుంది. ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ దర్శకులు ప్రభంజనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్లు సాధిస్తే ఇండియన్ ఇండస్ట్రీ ఖ్యాతి మరింతగా పెరుగుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీని టచ్ చేసేవారు కూడా ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్.. గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించి.. తమకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ.. ఒక దర్శకుడు మాత్రం.. మొదట్లో మంచి సినిమాలను తెరకెక్కించి.. స్టార్ డైరెక్టర్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తాను తెరకెక్కించిన ఒకే ఒక్క సినిమాతో డిజాస్టర్‌ని మూటకట్టుకుని.. ఇండస్ట్రీకి దూరమైపోయాడు.
ప్రస్తుతం ఆయన.. ఎవరితో సినిమా చేస్తున్నాడో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇంతకీ.. ఆ డైరెక్టర్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు సురేందర్ రెడ్డి. అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. మంచి సక్సెస్ అందుకున్న సురేందర్ రెడ్డి.. తర్వాత కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, ధృవ అలాంటి సినిమాలను తెరకెక్కించి సక్సెస్ఫుల్ సినిమాలను తనఖా తల వేసుకున్నాడు. ప్రేక్షకుల్లో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. అయితే.. ఆయన డైరెక్షన్ లో అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ తో దెబ్బకు సురేందర్ రెడ్డి ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు. ఇండస్ట్రీలో అసలు ఆయన పేరే వినిపించకుండా పోయింది అనడంలా అతిశయోక్తి లేదు.
ఇలాంటి క్రమంలో ఆయనతో ఎవరు సినిమా చేయడానికి కూడా సిద్ధంగా లేరట. కాగా.. ఎపి డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సురేందర్ రెడ్డికి ఓ అవకాశం ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో.. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన.. పవన్ డిప్యూటీ సీఎం గా బిజీ అయిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఇదే కథను సురేందర్ రెడ్డి పూర్తి చేసుకుని.. పవన్ కి వినిపించాడట. సినిమాను చేద్దామని.. పవన్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇక పవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ట్రాక్ రికార్డులను చూసి సినిమాల్లో అవకాశాలు ఇచ్చే టైప్ అస్సలు కాదు. ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చి.. కంటెంట్ వర్కౌట్ అవుతుందని నమ్మకంతో పవన్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న సురేందర్ రెడ్డి.. తన కథతో ఈ సరైన మంచి హిట్ అందుకొని స్ట్రాంగ్ త్రోబ్యాక్ ఇస్తాడో.. లేదో.. చూడాలి.