సౌత్ రిచెస్ట్ హీరో నాగార్జున ఆస్తులు లెక్కలు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. .!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నటవార‌సుడిగా అడుగుపెట్టి.. కింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు నాగార్జున. నటన స్టైల్‌తో ఆకట్టుకున్న నాగార్జున.. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన యంగ్ లుక్, ఫిగ‌ట్‌నెస్‌తో కుర్ర‌కారును ఆకట్టుకుంటున్నాడు. నాగార్జునకు ఈ జనరేషన్ అమ్మాయిల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌న‌డంలో అతిశయోక్తి లేదు. తండ్రికి తగ్గ తనయుడుగా సినీ లెగసీని కంటిన్యూ చేస్తున్న నాగ్.. కేవలం నటుడుగానే కాదు.. నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, బిజినెస్ మాన్ గా అన్ని విధాలుగా సత్తా చాటుకుంటున్నాడు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ రిచెస్ట్ హీరోగా దూసుకుపోతున్నాడు.

Nagarjuna Akkineni wealth, assets & lavish lifestyle: A Rs 45 Crore  Hyderabad mansion, private jet, multi-Crore business empire, fleet of  supercars & more | GQ India

ఈ క్రమంలో ఉన్న నాగార్జున ఆస్తుల లెక్కలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఆ డీటెయిల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం కాయం. నాగార్జున ఆస్తులతో పోలిస్తే.. ఇతర సౌత్ హీరోలు అసలు దరిదాపుల్లో కూడా లేరని చెప్పాలి. నాగార్జున ప్రస్తుతం నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ ఇంటి విలువ ఏకంగా రూ.50 కోట్లు, బంజారాహిల్స్ లో 22 ఎకరాల స్థలంలో ఏఎన్ఆర్ నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఆయన అధినేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీని విలువ దాదాపు రూ.1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. హైదరాబాద్‌లోనే పలు ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లు, హోటల్స్‌, ప‌బ్లు.. ఇలా రకరకాల వ్యాపారాల్లో నాగార్జున ఏడాదికే కోట్లల్లో సంపాదిస్తున్నాడు.

Sneak Peek into Nagarjuna House in Hyderabad - Jubilee Hills Bungalow

అంతేకాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ భారీగా పెట్టుబడులు పెడుతూ వస్తున్న నాగ్‌.. హైదరాబాద్‌లో పలు స్థిరాస్తులను సైతం సొంతం చేసుకున్నారు. మరోవైపు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ టీంకు యజమానిగా వ్యవహరిస్తున్నాడు. నటుడుగా ఒక్క సినిమాకు రూ.20 నుంచి 25 కోట్ల రెమ్యూనరేషన్ను తీసుకుంటున్న ఈయన.. ప్రముఖ రియాలిటీ షో.. బిగ్ బాస్ హోస్ట్‌గాను వ్యవహరిస్తున్నాడు. ప్రతి ఏడాది రూ.25 కోట్ల వరకు ఈ షో నుంచి రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. నాగార్జున దగ్గర ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లతో పాటు.. ప్రైవేట్ జట్టు కూడా ఉంది. ఇక ఈ చెట్టు విలువ రూ.30 కోట్ల వరకు ఉంటుందట. మొత్తంగా నాగార్జున ఆస్తుల నికర విలువలు రూ.3050 కోట్లు కాగా.. నాగార్జున ప్రతి ఏడాది తన ప్రొఫెషన్ తో పాటు.. వ్యాపారాలతోనూ అంతకంతకు ఆస్తులను పెంచుకుంటూ పోతున్నాడు.