టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. నిన్నమొన్నటి వరకు ప్రాంతీయ భాష సినిమాలోనే నటించినా.. విదేశాల్లో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న మహేష్‌కు.. ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి వాతావరణం మొదలైపోతుంది. సినిమా హిట్, ఫ్లాప్ అనే టాక్ తో సంబంధం లేకుండా.. కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు బ్లాస్ట్ అవ్వడం కాయం.
దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ తాజాగా మహేష్ నుంచి రీ రిలీజై సంచలనం సృష్టిస్తున్న ఖలేజా మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ 15 ఏళ్ల ఫ్లాప్ సినిమా.. ఇప్పుడు రీ రిలీజ్‌లో మాత్రం సంచలనం సృష్టిస్తూ.. బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ గా దూసుకుపోతుంది. అత్యధిక కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తుంది. అలా.. ఇప్పటివరకు మహేష్ నటించిన సినిమాలో చాలానే రీ రిలీజ్ అవుతూ వచ్చాయి. అందులో చాలా సినిమాలు సంచలనలో సృష్టించాయి.
ఇక ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్ లో రీ రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలలో.. హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 లిస్టులో.. మహేష్ బాబు ఏకంగా నాలుగు సినిమాలకు చోటు దక్కించుకోవడం విశేషం. వాటిలో మొదట మురారి. ఈ సినిమా రిలీజ్ లో రూ.8.90 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇక తాజాగా రీ రిలీజ్ అయిన ఖలేజా కేవలం ఒక్క రోజులో రూ. 6.85 కోట్లు దక్కించుకోగా.. ఇప్పటికీ బుకింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మూడవది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా రీ రిలీజ్‌లో రూ.6.60 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. నాలుగో స్థానంలో బిజినెస్ మాన్ నిలిచింది. ఏకంగా రూ.5.85 కోట్ల కలెక్షన్లతో ఈ సినిమా రీ రిలీజ్‌లో దూసుకుపోయింది. ఇలా.. మహేష్ నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లతో రికార్డు క్రియేట్ చేశాయి.