స్టార్ హీరోలు, దర్శకులు కూడా నన్ను కోరారు.. అనసూయ బోల్డ్ కామెంట్స్..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది యాంకర్ అనసూయ. కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్‌లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే జబర్దస్త్ యాంకర్ గా అవకాశాన్ని దక్కించుకొని తన మాటతీరు, స్టైల్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకుందో.. అప్పటినుంచి అమ్మడికి మంచి క్రేజ్ పెరిగింది. ఓ విధంగా బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసిందే అనసూయ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే జబర్దస్త్ యాంకర్ గా తిరుగులేని క్రేజ్‌దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత.. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మంచి నటిగాను సత్తా చాటుకుంది. ఇందులో భాగంగానే పూర్తిస్థాయిలో న‌టిగా మారెందుకు జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పేసిన అనసూయ.. ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

రంగస్థలం, పుష్ప, పుష్ప 2, రజాకర్ లాంటి సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా కనిపించనుందట. కాగా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎలాంటి విషయాలపైనైనా నిర్మొహమాటంగా చెప్పేసే అనసూయ.. పలు రియాలిటీ షోలకు జడ్జిగాను వ్యవహరించింది. అంతేకాదు.. ఎన్నో ఇంటర్వ్యూలో సందడి చేసింది. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అన‌సూయ శృంగారం డురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మనిషికి తిండి ఎలాగో.. సెక్స్ కూడా అంతే. అలా అని ఓపెన్ గా అది చేయమని మాత్రం నేను చెప్పను అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

ఇక ఈ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మిమ్మల్ని ఇప్పటివరకు ఎవరైనా ఫ్లార్డ్‌ చేసేందుకు ప్రయత్నించారా అని అడగగా.. దానిపై రియాక్ట్ అవుతూ కొంతమంది హీరోలు , డైరెక్టర్లు చాలా ప్రయత్నించారు అంటూ వివరించింది. అందులో తప్పేమీ లేదంటూ అనసూయ కామెంట్స్ చేసింది. ఇక అనసూయ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అమ్మడి మాటలకు కొంతమంది రకరకాల విభిన్న కామెంట్స్‌తో రియాక్ట్ అవుతూ.. ఆ వీడియోను తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. కాగా.. ఇటీవల అనసూయ తన కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో పంచుకోగా.. అవి ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే తనకు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ ముద్దుగుమ్మ పాత్రల సెలెక్షన్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది.