తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో జర్నలిజంతో కెరీర్‌ను ప్రారంభించిన విశేషమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది యాంకర్ సావిత్రక్క. శివజ్యోతి మొదట న్యూస్ ఛానల్లో సావిత్రి అక్కగా రాణించిన తర్వాతజజ పలు చానల్స్ లో పనిచేస్తూనే.. బిగ్‌బాస్ షోలో అవకాశాన్ని కొట్టేసింది. ఈ షోలో తన ఆటతీరు, వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు.. హౌస్‌లోనూ అందరితో కలుపుగోలుతనంగా వ్యవహరించిన శివ జ్యోతి.. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు చానల్స్‌లో రకరకాల షోస్‌లో సందడి చేసింది. ఇక.. ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన నవ్వుతూ.. అందరిని నవ్వించే శివజ్యోతి.. ఆత్మహత్యకు పాల్పడ్డారని న్యూస్ ప్రస్తుతం సంచలనగా మారింది. ఇంతకీ.. శివజ్యోతి ఎందుకు అంతటి ఘోర నిర్ణయం తీసుకుంది. దానికి గల కారణాలేంటో ఒకసారి చూద్దాం. నిజామాబాద్ నాగంపేట గ్రామానికి చెందిన శివజ్యోతి.. ఎంటర్టైన్మెంట్ రంగంలో సావిత్రక్కగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.
టీవీ కార్యక్రమం తో విశేష గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తన ఎంటర్టైనర్ కెరీర్‌ను మొదలు పెట్టక ముందు లైఫ్ చాలా కష్ట కాలంగా ఉండేది అంటూ వివరించింది. చిన్న వయసులోనే గంగులును ప్రేమించిన ఈమె తన ప్రేమ కారణంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొందట. పదవ తరగతికి వచ్చేసరికి వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోవడంతో.. ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. వెంటనే ముంబైలోని బంధువుల వద్దకు పంపించి.. అక్కడే ఉంచేసారంటూ చెప్పుకొచ్చింది. అయితే.. కొన్నాళ్ళకు మళ్ళీ సొంత ఊరు చేరినా.. కొంతవరకు కష్టాలు తగ్గాయి కానీ.. గంగులును వదిలి తాను ఉండలేనని తెల్చి చెప్పడంతో ఫ్యామిలీ పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారట. ఆ టైంలో చాలా టెన్షన్ పడిపోయిన ఆమె.. భయాందోళనతో వెంటనే నిద్ర మాత్రలు మింగే ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అపస్మారక స్థితిలో ఉన్న శివ జ్యోతిని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించి.. ఆమెను కాపాడారు. తర్వాత పై చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన శివ జ్యోతి.. అక్కడ తన సోదరులతో పాటు.. ప్రియుడు గంగులతో ఒకే రూమ్ లో ఉండేవారు. గంగులు కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని సాధించాడు. ఇక టెలికాలర్‌గా కెరీర్ ప్రారంభించిన శివజ్యోతి.. టీవీ యాంకర్ గా మారింది. ఈ క్రమంలోనే అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. ఇద్దరు కొంతమేర సెటిల్ అయిన తర్వాత.. నిజామాబాద్‌లోని సాయిబాబా గుడిలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం బిగ్‌బాస్‌కు వెళ్లిన శివజ్యోతి.. టీవీ షోలను నిర్వహిస్తూ.. ప్రేక్షకుల మధ్య సందడి చేస్తుంది. ప్రస్తుతం భార్యతో పాటు భర్త గంగులు కూడా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టి పలు షోలలో సందడి చేస్తున్నాడు. శివజ్యోతి మరోపక్క.. యూట్యూబర్గాను రాణిస్తుంది. భర్తతో కలిసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా సంపాదన ప్రారంభించింది. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానల్ లో లవ్ స్టోరీని రివిల్ చేసింది శివజ్యోతి.