సినీ ఇండస్ట్రీలో జనరేషన్ల వారీగా సక్సెస్ రేట్ తగ్గిపోతూ వస్తుంది. ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో కేవలం 10 శాతమే సక్సెస్ రేట్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అందుకుంటున్నాయి. అలా.. 2025లో ఏకంగా 92 సినిమాలు రిలీజ్ అయితే కేవలం 8 సినిమాలు మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యాయి. అంటే.. ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ 2025లో బ్రేక్ ఈవెన్ అయిన ఆ సినిమాల లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అవేంటో ఒకసారి చూద్దాం. ఇక ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మొట్టమొదటి సినిమా ఏంటో అందరికీ తెలిసిందే సంక్రాంతికి వస్తున్నాం. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసుళను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.
ఈ సినిమా తర్వాత సంక్రాంతి హిట్ సినిమాల్లో డాకు మహారాజ్ లిస్టులో నిలిచింది. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కూడా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఇక ఈ రెండు సినిమాలు తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ అయిన తండేల్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగచైతన్య హీరోగా నటించిన సినిమా ఎప్పటినుంచో ఫ్లాప్‌లలో కూరుకుపోయినా చైతుకు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత కోర్ట్, మ్యాడ్ 2 సినిమాలు మంచి సక్సెస్‌లు అందుకున్నాయి. అలా మార్చి నెల వరకు బాక్సాఫీస్ దగ్గర వచ్చిన సినిమాల్లో సక్సెస్‌లకు అసలు కొదవలేదని చెప్పాలి.
ఏప్రిల్ నెలలో మాత్రం చాలా సినిమాలే రిలీజ్ అయినా.. ఒక్క సినిమా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక మే నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో మే 1న రిలీజ్ అయిన హిట్ 3 మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచి కలెక్షన్లు కొల్లగొట్టింది. అదే మే నెలలో రెండో వారంలో రిలీజ్ అయిన సింగిల్, శుభం సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఈ రెండు సినిమాల నిర్మాతలకు సైతం లాభాలు వచ్చాయి. 2025లో రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లు టాలీవుడ్ ఖాతాలో చేరాలని టాలీవుడ్ మళ్లీ పూర్వ వైభవం దక్కించుకోవాలని అంత ఆశపడుతున్నారు. జులై నెలలో క్రేజీ సినిమాలు ధియేటర్లో రిలీజ్ కానున్నాయి. వీటితో అయినా టాలీవుడ్‌కు మరోసారి పూర్వ కళ వస్తుందేమో వేచి చూడాలి.