నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస ప్లాపులతో కూరుకుపోయిన క్రమంలో.. కొత్త లైనప్‌ని ఇచ్చిన డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే దానికి బోయపాటి అనే సమాధానం వినిపిస్తుంది. బాలయ్య సినీ కెరీర్లో.. ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్లతో పనిచేసిన బోయపాటి శ్రీను స్థానం మాత్రం ఎంతో స్పెషల్ అనడంలో అతిశయోక్తి లేదు. నరసింహనాయుడు సినిమా తర్వాత సరైన కమర్షియల్ సక్సెస్ లేక సతమతమవుతున్న బాలయ్యకు సింహ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి.. స్ట్రాంగ్ కం బ్యాక్‌కు కారణం అయిన బోయపాటి.. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఫ్లాప్స్ ఎదురవుతున్న నేపథ్యంలో.. లెజెండ్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్‌ను అందించాడు బోయపాటి శ్రీను. ఇక ఈ సినిమా తర్వాత రెండు, మూడు సినిమాలతో సక్సెస్ అందుకున్న బాలయ్యకు.. మరోసారి ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఇక బాలకృష్ణ రూలర్ సినిమా తర్వాత ఆయన కెరీర్ అయిపోయిందని అంతా భావించారు.
అలాంటి నేపథ్యంలో.. అఖండ సినిమాతో అఖండ విజయాన్ని అందించిన బోయపాటి.. ఏకంగా ఈ సినిమాతో రూ.75 కోట్ల షేర్ వసూళ్లను కల్లగొట్టడు. ఈ సినిమా తర్వాత.. బాలయ్య మైండ్ సెట్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు సినిమా అవకాశాలను ఇస్తూ తనను తాను పూర్తిగా మార్చుకుని వరుస సినిమాల్లో నటించి సూపర్ హిట్లు అందుకుంటున్నాడు. ఇదంతా జరగడానికి బోయపాటి శ్రీను ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి బోయపాటితో మరోసారి బాలయ్య అఖండ 2 తాండవం సినిమాలో చేస్తున్నాడు. ఇక సరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా.. ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా బాలయ్య, బోయపాటి మధ్య సినిమా షూట్ టైంలో వార్ మొదలైందంటూ.. వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక బోయపాటి సినిమాలంటే ఆడియన్స్ ముందుగానే లాజిక్ ను వెతకడం మానేసి.. మ్యాజిక్ ను మాత్రమే చూడాలని ఫిక్సై థియేటర్లకి వెళ్ళాలి. ఇది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే బోయపాటి తన ప్రతి సినిమాలానే అఖండ 2 సినిమా కోసం కూడా ఒక ఆయుధాన్ని తయారు చేయించారట. అదే గధ. ఇక ఆ గధపై త్రిశూలం గుర్తు ఉండేలా డిజైన్ చేయించాడట. ఇక బాలయ్య కు మొదటి నుంచి పురాణాలపై పట్టు ఉన్న నేపథ్యంలో.. దీనిని గధ అంటారా.. గధ పై ఎక్కడైనా త్రిశూలం ఉంటుందా అంటూ సీరియస్ అయ్యారట బాలయ్య. అప్పుడు బోయపాటి మన సినిమాలో అలాగే ఉంటుంది బాబు అని అశ్ద్ధగా సమాధానం చెప్పడంతో బాలయ్యకు కోపం వచ్చేసిందని.. ఇద్దరి మధ్య కాసేపు వాదోపవాదాలు తర్వాత.. సెట్స్ వాతావరణం ఫుల్ హీట్ గా మారిపోయిందని టాక్. కానీ.. చివరకు ఇద్దరు సర్దుకొని షూటింగ్ ముగ్గించేసారట. ఇక అప్పటినుంచి విరిద్దరి మధ్య చిచ్చు మొదలైందని సమాచారం. కాగా సినిమాలో ఈ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.