ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో రానున్న మోస్ట్ అవైటె మూవీ పుష్ప 2. రష్మిక మందన హీరోయిన్గా, శ్రీ లీల ఐటమ్ క్వీన్‌గా మెరవనున్న ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఇక సాధారణంగా ప్రజలంతా ఎంటర్టైన్మెంట్ కోసం.. అతి తక్కువ వ్యయంతో ఎంచుకునే ఒకే ఒక్క మార్గం సినిమా. ఈ క్రమంలోనే చాలామంది కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లి ఎంటర్టైన్ అవ్వాలని భావిస్తూ ఉంటారు. అయితే త్వరలో రిలీజ్ కానున్న పుష్ప 2 విషయంలో మాత్రం ఇది వర్కౌట్ అవ్వదని.. కుటుంబంతో కలిసి పుష్ప 2ను చూడడం అసాధ్యం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం పుష్ప 2 టికెట్స్.. భారీగా పంచడమే. పుష్ప 2 ను మల్టీప్లెక్స్ లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు అనుకోవడం కత్తి మీద సామే అవుతుంది.
సినీ ఇండస్ట్రీలో కనీ..వినీ.. ఎరగని రీతిలో టికెట్ రేట్లు పెంపుదల.. పుష్ప 2 మేకర్స్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే టికెట్ రేట్‌లో పుష్ప 2 చరిత్ర సృష్టించనుంది. ముందుగా నైజాం టికెట్ రేట్స్ లకు వస్తే 5వ తేదీ రిలీజ్ కానున్న ఈ సినిమా బెనిఫిట్ షో 4వ తేదీ రాత్రి 9:30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఒంటిగంట షో కూడా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఏవో ప్రధాన థియేటర్స్ లో మాత్రమే ఎప్పుడు బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ పుష్ప 2కి మాత్రం నైజంలోని అన్ని మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ లలో బెనిఫిట్ షోలు వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. టికెట్ పై రూ.800 పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. అంతేకాదు సింగిల్ స్క్రీన్ లపై 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లకు టికెట్ రేట్లు పై రూ.150 వరకు పెంచుకునే పర్మిషన్లు ఇచ్చారు.
9 నుంచి 16వ తేదీ వరకు టికెట్ రేట్‌లపై రూ.105.. 17 నుంచి 23 వరకు రూ.20 టికెట్ రేట్లను పెంచుకునేలా పర్మిషన్స్ తెచ్చుకున్న పుష్ప 2 మేకర్స్.. ఇక మల్టీప్లెక్స్ స్క్రీన్ లపై 5 నుంచి 8వ తేదీ వరకు టికెట్ కు రూ.200 పెంపు.. 9 నుంచి 16వ తేదీ వరకు రూ.150 పెంపు, 17 నుంచి 23 తేదీల వరకు రూ.50 పెంచుకునే పర్మిషన్లు కూడా ఇచ్చేశారు. వీటన్నిటికీ జిఎస్టి అదనంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి పుష్ప 2ను చూడాలంటే రూ.2000 పైగా ఖర్చు అయిపోతుంది. ఇక ఇంటర్వెల్ స్నాక్స్ కూడా అంటే రూ.3500 వరకు అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అదే ఒక్కరోజు ముందు బెనిఫిట్ షోలో సినిమా చూడాలంటే కేవలం టికెట్లకే కుటుంబ సభ్యులకు రూ.5 వేలు అయిపోతుంది. పోనీ సింగిల్ స్క్రీన్ లో చూద్దామన్న నలుగురు కుటుంబ సభ్యులకు రూ.2వేలు ఫస్ట్ వీక్ ఎండ్లో సినిమా చూడాలంటే కేవలం టికెట్లకే ఖర్చు అవుతుంది. ఓవరాల్ గా సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి 19 రోజుల పాటు పుష్ప 2 సినిమాకు సాధారణ ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూడడం అంటే అది కష్టమే. ఇంకా ఎలాగైనా కుటుంబంతో కలిసి సినిమాను చూడాలనుకుంటే డిసెంబర్ 24వ తేదీ మాత్రమే వీలవుతుందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.