మోక్షజ్ఞతో పోటీకి సై అంటున్న ఎన్టీఆర్.. కుండబద్దలు కొట్టేసిన వైవిఎస్..

నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను డైరెక్టర్ వైవిఎస్ తీసుకున్నారు. హరికృష్ణ మనవ‌డు, జానకిరామ్ తనయుడుగా.. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లో వైవిఎస్ చౌదరి.. దర్శక, నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ స‌ర‌సన తెలుగు అమ్మాయి వీణ రావుని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం తాజాగా ప్రెస్మీట్‌ ఏర్పాటు చేసిన వైవిఎస్.. ఈ ఈవెంట్‌లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలపై కుండ బద్దలు కొట్టే సమాధానం చెప్పాడు. ముందుగా తన సినిమాల్లో తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నారని.. ఇన్నాళ్లకు అది కుదిరింది అంటూ చెప్పుకొచ్చాడు.

మోక్షజ్ఞ సినిమా దెబ్బకి India షేక్ అవుతుంది || YVS Chowdary About Nandamuri  Mokshagna Movie || NS

భానుమతి సాక్షిగా వీణారావుని పరిచయం చేసిన వైవిఎస్ చౌదరి.. ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు 18 నెలల ముందు నుంచే కావాల్సిన వర్క్ అంత పూర్తి చేశానని.. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నానంటూ వెల్లడించాడు. ఇక అతనితో సినిమా కోసం ఆయన తల్లి నుంచి పర్మిషన్ ముందే తీసుకున్నామని.. సినిమా గురించి అడిగినప్పుడు ఆమె ముందే నియమాలన్నీ చెప్పారని వెల్లడించారు. అయితే జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ సినిమా కోసం కళ్యాణ్ రామ్, తారక్‌ల పర్మిషన్ కూడా తీసుకున్నారా అని ప్రశ్న ఎదురు కాగా.. నందమూరి ఫ్యామిలీ అందరితోనూ నేను మాట్లాడాను అని వైవిఎస్ చెప్పుకొచ్చాడు.

Janaki Ram Nandamuri Latest News in Telugu, Janaki Ram Nandamuri Top  Headline, Photos, Videos Online | Chitrajyothy

సినిమా ఓపెనింగ్ రోజే కళ్యాణ్, తారక్.. ఎన్టీఆర్ గురించి ట్విట్‌ చేశారని.. దాన్ని బట్టి వారి సపోర్ట్ అతనికి ఉందని వైవిఎస్ వెల్లడించారు. త్వరలో మోక్షజ్ఞ సినిమా కూడా మొదలవుతున్న క్రమంలో మోక్షజ్ఞకు ఎన్టీఆర్ పోటీ వస్తాడా అన్న ప్రశ్నకు.. వైవిఎస్ రియాక్ట్ అవుతూ ఎవరికీ ఎవరు పోటీరారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసానని వెల్లడించాడు. ఇక‌ వైవిఎస్.. మోక్షజ్ఞ సినిమా వస్తే తన సినిమాకు పోటీగా మా సినిమాను తీసుకురాలేమని వెల్లడించాడు. మొత్తానికి తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పై మరో ఎన్టీఆర్ పరిచయం కానున్నాడు. ఈ మధ్య తన ఫస్ట్ వాయిస్ టీజర్ తో ఇంప్రెస్ చేసిన ఈ యంగ్ హీరో.. స్క్రీన్ ప్రజెంట్ తో ఎలా ఆకట్టుకుంటాడో.. ఫ్యాన్స్‌ను ఏ రేంజ్ లో సంపాదించుకుంటాడో చూడాలి. వైవిఎస్ చౌదరి మాత్రం ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.