బుక్ మై షో వర్సెస్ డిస్ట్రిక్ట్.. పుష్ప 2 దెబ్బకు బుక్ మై షో కు గట్టి దెబ్బ..

సినీ ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే సినిమా విష‌యంలో థియేటర్‌ల‌కు, ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు మధ్యన గట్టి పోటీ ఉండడం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా ఇప్పుడు లిస్టులో ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్‌ల మధ్యన ఇలాంటి పోటీ నెలకొంది. ఇప్పటిదాకా ప్రధానంగా ఉన్న ప్లేయర్లు అంటే కేవలం బుక్ మై షో, పేటీఎం పేర్లు మాత్రమే వినిపించేవి. నైజాం ముఖ్యంగా హైదరాబాద్ ఆడియ‌న్స్ ఎక్కువగా బుక్ మై షో పైన ఆధారపడేవారు. ఎప్పటికప్పుడు గంటకు, రోజుకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయి అన్న అప్డేట్స్ కూడా ఫాన్స్ తో షేర్ చేస్తూ ఉండేవారు. ట్రేడ్ వర్గాలు సైతం దీనిని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ప్రేక్షకులకు అప్డేట్ ఇస్తూ ఉండేది.

Pushpa 2 On District: Setback For BookMyShow!

పేటీఎం వాడకం జిల్లా కేంద్రాలు, బీసీ సెంటర్లలో మాత్రమే చెప్పుకోదగ్గ రేంజ్ లో ఉండేది. అయితే ఇప్పుడు ఈ రెండిటిని తలదన్నేలా మరో కొత్త యాప్ రంగంలోకి దిగింది. పుష్ప 2 ది రూల్.. అధికారిక టికెటింగ్ పార్ట్నర్ గా డిస్ట్రిక్ట్ అవతరించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి పబ్లిసిటీ వస్తుంది. ఇక ఇది కొత్త కంపెనీ ఏం కాదు. గతంలో ఉన్న టిక్కెట్ న్యూ నడిపిస్తున్న పేటీఎం.. కొత్తగా జొమాటోతో పార్ట్నర్ షిప్ కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే డిస్ట్రిక్ట్ జొమాటో యాప్‌ సృష్టించారు. ఊరికే లాంచ్ చేస్తే జనాలకు ప్రమోట్ కాదు. కాబట్టి పుష్ప 2 తో కోలాబరేట్ చేశారు. దీంతో కోట్ల రూపాయల ప్రమోషన్స్ ఈజీగా జరిగిపోతున్నాయి. పేటీఎంలో వందలాది సర్వీస్లు ఉంటే.. డిస్ట్రిక్ట్ లో మాత్రం కేవలం సినిమాలు, ఈవెంట్ టికెట్లు అమ్మకాలు మాత్రమే జరుగుతుండడంతో టికెట్ల బుకింగ్ విషయంలో గట్టి పోటీ ఇస్తుంది.

Probe ordered against BookMyShow for forming cartel | Probe ordered against  BookMyShow for forming cartel

ఓ రకంగా చెప్పాలంటే బుక్ మై షో వ‌ర్స‌స్‌ డిస్ట్రిక్ట్ పోటి ఉండ‌నుంది. ఇప్పుడు డిస్టిక్ ప్రభావం బుక్ మై షో పై ఖచ్చితంగా ఉంటుందని.. బుక్ మై షో కి భారీ బొక్క తప్పదు అని టాక్ న‌డుస్తుంది. ఇక దీనికి ముఖ్య కారణం అన్ని యాప్ల కంటే ఎక్కువగా డిస్ట్రిక్ట్ లోనే సినిమా టికెట్లు దొరుకుతాయ్ అంటూ వస్తున్న ప్రచారమే. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అంతా సినిమా టికెట్లను బుక్ చేసుకోవడానికి ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా డిస్ట్రిక్ట్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే దేశమంతా టికెట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ ని డిస్ట్రిక్ట్ యాప్ తట్టుకుంటుందో.. లేదో.. వేచి చూడాలి. బలమైన సర్వర్లు ఉన్న స‌లార్‌ టైంలో బుక్ మై షోకు గంటలు తరబడి క్లాష్‌ వచ్చింది. ఇప్పుడు పుష్పా సునామీని ముందే ఊహించే డిస్ట్రిక్ట్ మేకర్స్ దానికి తగ్గట్టుగా రెడీ చేశారో.. లేదా షోలు.. స్క్రీన్లు పెరిగే కొద్దీ ఈ యాప్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియాలంటే ఇంకో రెండు రోజుల్లో వేచి చూడాలి.