ఓ పక్క సినిమాలతోనూ.. మరో పక్క పాలిటిక్స్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో మొదలుపెట్టిన ఓజి, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లు ఇప్పుడు చివరి షెడ్యూల్ కు వస్తున్నాయి. ఇటీవల పవన్.. హరిహర వీరమల్లు షూటింగ్ సెట్స్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్‌లు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓజీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది.
అదేంటో కాదు.. పవర్ స్టార్ నటిస్తున్న ఓజీలో.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నాడని.. ఒక గెస్ట్ రోల్‌లో చిటుకున్న మెరవనున్నాడని సమాచారం. ఓజీ సెకండ్ హాఫ్ చివర్లో ప్రభాస్ కనిపిస్తాడట. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాకున్నా.. ఈ వార్త ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే ఇటు పవన్ అభిమానులతో పాటు.. అటు ప్రభాస్ అభిమానులు కూడా ఫుల్ పండుగ చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజంగానే వస్తే బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటూ.. ఇక సరికొత్త సంచలనాలు క్రియేట్ అవుతాయంటూ.. అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక డైరెక్టర్ సుజిత్ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి. గతంలో కూడా సుజిత్.. ప్రభాస్ తో కలిసి సాహో సినిమా చేశాడు. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా.. ప్రభాస్ ఓజీ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. అయితే ప్రభాస్ సినిమాలు నిజంగానే నటిస్తున్నాడా.. లేదా అనే విషయంపై డైరెక్టర్ ఏదైనా హింట్ ఇస్తారేమో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఓ పక్క రాజాసాబ్ సెట్‌లో బిజీగా గడుపుతున్నాడు. దీని తర్వాత సలార్ 2, స్పిరిట్, కల్కి 2 ఇలా వరుస ప్రాజెక్టులో లైన్లో ఉన్నాయి. ఇంత బిజీ లైనప్లోను సుజిత్ కోరిక మేరకు ప్రభాస్ ఓజి సినిమాలో నటిస్తాడో లేదో వేచి చూడాల్సి ఉంది.