నా బాస్ ఆవిడే.. బాలయ్య చిలిపి ప్రశ్నకు బాబు బ్రిలియంట్ ఆన్సర్.. !

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4. తాజాగా మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన ఈషో బుల్లితెర ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహా పై స్ట్రీమింగ్ అయిన ఈ షో.. మూడు సీజన్‌ల‌ టిఆర్పి రేటింగ్ రికార్డు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మొదలైన అన్‌స్టాపబుల్ సీజన్ 4 బాలయ్య పండుగపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మూడు సీజన్‌ల‌లో ఎంతో మంది స్టార్ హీరోస్ హాజరై సందడి చేయగా.. తాజాగా సీజన్ 4కు హోస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని సందడి చేశారు.

Balayya and Chandrababu film Unstoppable episode - TeluguBulletin.com

ఈ ఎపిసోడ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అయింది. మరోసారి బాలయ్య తన ఎనర్జిక్ హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎప్పటికప్పుడు గెస్ట్‌లుగా వచ్చిన వారిని తిక్కమ‌క పెట్టి.. తంటాలు పెట్టే బాలయ్య, చంద్రబాబును కూడా అలాంటి ప్రశ్నలతోనే ముంచేసాడు. అయితే చంద్రబాబు కూడా బాలయ్య‌ చిలిపి ప్రశ్నలకు తన బ్రిలియన్స్‌తో సమాధానం చెప్పి ఆకట్టుకున్నాడు. షో ప్రారంభంలో బాలకృష్ణ అష్టాపబుల్ వోత్ అనే బుక్ పై చంద్రబాబుతో ప్రమాణం చేయించుకున్నాడు. ఈ షోలో నాపై ప్రేమతో నవ్వుతూ అన్ని నిజాలే చెప్పాలని.. బాలయ్య ప్రమాణం చేయించగా.. చంద్రబాబు సమయస్ఫూర్తితో సమాధానం చెబుతానంటూ నవ్వులు పూయించారు.

Balayya and Chandrababu get serious - TeluguBulletin.com

ఇక షో ప్రారంభమైంది. చంద్రబాబును.. బాలయ్య తన ప్రశ్నలతో తికమకపెట్టే ప్రయత్నం మొదలు పెట్టాడు. అందులో భాగంగా మా చెల్లెలితో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో చూసిన రొమాంటిక్ మూవీ ఒకటి చెప్పమని ప్రశ్నించాడు. నువ్వు మరీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం అంటూ చంద్రబాబు న‌వ్వ‌తూ రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత స్క్రీన్ పై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బ్రాహ్మణి ఫోటోలను పెట్టి ఇద్దరిలో ఇంటి బాస్ ఎవరు అని ప్రశ్నించాడు బాలయ్య. దానికి చంద్రబాబు చాలా తెలివిగా రియాక్ట్ అవుతూ నాకు భువనేశ్వరి బాస్.. మా అబ్బాయికి బ్రాహ్మణి బాస్ అంటూ చెప్పుకొచ్చాడు. దానికి బాలకృష్ణ.. అలా ట్రైనింగ్ ఇచ్చి పంపించాం మరి అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. దీంతో షోలో వారంతా ఒక‌సారిగా న‌వ్వారు. అలా ఈ ఎపిసోడ్లో ఇంతకా ఎన్నో ఇంట్ర‌స్టింగ్ సంభాష‌న‌లు జ‌రిగాయి.