అన్‌స్టాప‌బుల్ 4 ప్రోమో వ‌చ్చేసింది… బాల‌య్య మీద ఒట్టు వేసిన చంద్ర‌బాబు… ( వీడియో )

బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌షో అన్‌స్టాపబుల్ ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి టిఆర్పి రేటింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ షో నాలుగో సిరీస్‌ను ప్రారంభించారు మేకర్స్. అక్టోబర్ 25 నుంచి 4 సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా సీఎం చంద్రబాబు హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమో ఓటీటీ వేదిక ఆహా తాజాగా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా వేదికగా తెగ ట్రెండ్ అవుతుంది.

Unstoppable With NBK Season4 first episode Balakrishna with ap cm Chandrababu streaming on octorber 25th ta | Unstoppable With NBK Season4: బావ బామ్మర్దుల టాక్ షోకు డేట్, టైమ్ ఫిక్స్.. మరోసారి బాలయ్య ...

ఇక ఈ షోలో భాగంగా సీఎం చంద్రబాబుతో.. బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించాడు. చంద్రబాబు నాయుడు అనే నేను.. బాలకృష్ణ పై ప్రేమతో ఏది అడిగితే దానికి నవ్వుతూ సమానం చెబుతా అంటూ ప్రమాణం చేయించగా.. సమయస్ఫూర్తితో సమాధానం చెబుతా అంటూ చంద్రబాబు తన వేలో ప్రమాణం చేశారు. ఈ క్రమంలో షోలో నవ్వులు పూసాయి. బాలకృష్ణ పై చంద్రబాబు ఒట్టు వేసి ప్రమాణం చేయడంతో ఆయన ఒక్కసారిగా కంగారు పడ్డాడు. మీ చమత్కారం మీది.. మా సమయస్ఫూర్తి మాది.. అంటూ చంద్రబాబు అనడం ప్రోమోలో హైలెట్‌గా నిలిచింది.

Unstoppable with NBK Season 4, Episode 1 | N Chandrababu Naidu | Balakrishna | Manastarsచంద్రబాబు అరెస్ట్.. జైలులో గడిపిన క్షణాలు.. ఈ ఎపిసోడ్లో పంచుకున్నట్లు ప్రోమోలో క్లియర్గా చూపించారు. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టనని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని తన ఆకాంక్ష అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ప్రోమో నెటింట‌ వైరల్ గా మారుతుంది. దీంతో అన్‌ స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ.. బాలయ్య అభిమానులతో పాటు చాలామంది తెలుగు ప్రేక్షకులలోను ఆశ‌క్తి నెల‌క్కొంది.