సమంత ఫేవరెట్ హీరో ఎవ‌రో తెలుసా.. అస్సలు ఊహించలేరు..?

స్టార్ హీరోయిన్ సమంత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ మంచి సక్సెస్ అందుకుంది. లక్షలాది మంది అభిమాని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను ఫిధా చేసింది. తన గ్లామర్‌ ట్రీట్‌తో కుర్ర కారును కట్టిపడేసింది. సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్‌ సంపాదించుకున్న సమంత.. టాలీవుడ్లో అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇలాంటి క్రమంలో సమంత ఫెవ‌రెట్ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే సమంత ఫేవరెట్ హీరో ఎవరు..? అస్సలు ఊహించలేరు. ఆమె ఇష్ట‌ప‌డే హీరో ఎవ‌ర‌నే విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

Attarintiki Daredi – Movies on Google Play

సమంతకు ఇష్టమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక గతంలో సమంత, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో కలిసిన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ మూవీ తమిళ్, కన్నడ భాషలోనూ రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బెస్ట్ మూవీలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా.. షూట్ టైంలో పవన్‌తో సమంతకు మంచి పరిచయం ఏర్పడిందట. ఇక అల్లు అర్జున్‌తో కలిసి సమంత సన్ాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది. ఈ మూవీ సెట్స్ లో ఎప్పుడు చూసిన సమంత.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదని.. ఆయన చాలా మంచివారు, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది అంటూ చెప్పేదని.. షూటింగ్లో ఏ కొంచెం బ్రేక్ వచ్చిన ఇక పవన్ కళ్యాణ్ గురించి.. ఆయన విషయాల గురించి నాతో మాట్లాడేదని.. సమంతకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం అంటూ అల్లు అర్జున్ గతంలో చెప్పుకొచ్చాడు.

Stream Gautami Priyanka :) | Listen to Son of Satyamurthy songs playlist  online for free on SoundCloud

ఇక సమంతా అల్లు అర్జున్ జంటగా నటించిన సన్ఆఫ్ సత్యమూర్తి కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక బ‌న్నీ పుష్పా సినిమాలో కూడా సమంత స్పెషల్ సాంగ్లో చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో సమంత బోల్డ్ స్టెప్స్ తో కుర్ర కారన మెస్మరైజ్ చేసింది. ఇలాంటి క్రమంలో సమంత ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటూ తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రస్తుతం సమంత సింగల్ స్టేటస్ అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో డివోర్స్‌ తర్వాత మయోసైటిస్ బారిన పడిన సమంత.. విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. త్వరలోనే సమంత నుంచి సిటాడెల్‌ హనీ బ‌నీ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సిరీస్ పై అభిమానుల‌లో విపరీతమైన హైప్‌ నెలకొంది.