స్టార్ హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకం. ఆమె పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెలిసిందే. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన సమంత.. నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లైన కొన్నాళ్లకే విభేదాలతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం చైతన్య.. శోభిత ధూళిపాళ్లను నిశ్చితార్థం చేసుకుని త్వరలోనే వివాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇక సమంత మాత్రం ఒంటరి లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ క్రమంలోనే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమంత.. టాలీవుడ్ లో చివరిగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కనిపించింది.
ఈ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించిందే లేదు. ఈ క్రమంలోనే సమంత నుంచి ఓ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అనారోగ్య కారణాలతో సినిమాలకు ఏడాదిన్నర బ్రేక్ ఇచ్చిన అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారుతున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే సిటాడెల్.. హనీ.. బనీ.. వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ లో ఆడియన్స్‌ను పలకరించింది. ఇక ఈ సిరీస్ లో వరుణ్ దావన్ హీరోగా నటించాడు. ఇక ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రమోషన్స్‌లో వరుణ్ ధావన్ సమంత పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
సమంతతో నటించవద్దని చాలామంది నాకు సలహాఇచ్చారని వరుణ్ ధావన్ వెల్లడించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు సమంతతో యాక్ట్ చేయకు.. అలా చేస్తే నీకున్న క్రేజ్ కూడా పోతుందంటూ హెచ్చరించారని.. అయినా వారి మాటలను నేను పట్టించుకోకుండా సమంతతో నటించేసా అంటూ వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు. సమంత లాంటి టాలెంటెడ్ యాక్టర్‌తో నటించడం చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు. హీరోలకు ధీటుగా ఆమె చేసే ఫైట్ సీన్స్ ఆడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తాయి అంటూ వెల్లడించాడు. ఇక ఈగ.. సినిమాలో సమంత నటనకు తను ఫ్లాట్ అయిపోయానని.. అప్పటినుంచి సమంతా అంటే తనకు చాలా ఇష్టమని వరుణ్ పేర్కొన్నాడు. సామ్‌తో సినిమా అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారడంతో.. ఇంతకీ వరుణ్ దావన్‌ను సమంతతో నటించొద్దని హెచ్చరించిన ఆ సెలబ్రిటీస్ ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.