ఆ టైంలో హాస్పిటల్ కు కూడా ఎవ్వరూ తీసుకెళ్ళలేదు.. సమంత ఎమోషనల్..

స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాదిన్న‌ర కాలంగా ఓ సినిమాలో కూడా న‌టించ‌ని సంగతి తెలిసిందే. మయోసైటీస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఆ సమయంలో ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చేసి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చికిత్స తీసుకుంటూ దేశాలు చుట్టి వచ్చిన శ్యామ్.. ఏ సమయంలో ఎక్కడ ఉన్నా.. తాను ఏం చేస్తున్నా తన విషయాలన్నీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేది.

ఇక హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సిటాడల్ హిందీలో హనీ బన్నీ పేరు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నటించిన సమంత.. దీని ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన విషయాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది. కంటతడి పెట్టుకుంది. మయోసైటిస్‌ తనకు సోకిన సమయంలో చికిత్స ఎక్కడ దొరుకుతుందో తెలియలేదని.. ఒక్కసారిగా తాను గతమంతా మర్చిపోయినట్లు అనిపించేదని.. ఆ సమయంలో నన్నెవరూ ఆస్పత్రికి కూడా తీసుకువెళ్లలేదని.. చాలా ఇబ్బంది పడ్డాను అంటూ ఎమోషనల్ అయింది.

ఎలా ఉన్నావ్ సమంత అని అడిగిన వాళ్లే లేరని.. కనీసం పలకరించలేదని చెప్పుకొచ్చింది. సిటాడెల్ సెట్స్‌ పైకి వచ్చేవరకు నిర్మాత, దర్శకులు నాకోసం ఎదురు చూసినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది. తను చేయనన్న పట్టుబట్టి వాళ్ళు ఈ సినిమా నాతో చేయించారని.. సమంత వెల్లడించింది. ఇక ప్రస్తుతం సామ్ తన సొంత బ్యానర్ పై త‌నే ప్రొడ్యూస‌ర్‌గా మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమాలో న‌టిస్తుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తెర‌కెక్కుతున ఈ సినిమాల్లో హీరోగా ప్రియదర్శి నటించనున్నట్లు సమాచారం. ఇక తర్వాత మరో వెబ్ సిరీస్ లో నటించడానికి సామ్ గ్రీన్ సిగ్నల్చింది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబో స్పెషల్ సాంగ్ కోసం కూడా సమంతను అప్రోచ్ అయ్యార‌ట‌. ప్ర‌స్తుతం దీని ఓకే చేయాలా వ‌ద్దా అనే అలోచ‌న‌లో సామ్ ఉంద‌ట‌.