సినిమాలో అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాది పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్.. ఎవరంటే.. ?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఇమేజ్ను సంపాదించుకొని సినిమాలో నటిస్తున్న క్రమంలోనే.. తమతో నటించిన కోస్టార్స్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలా హీరో, హీరోయిన్లుగా నటించిన వారు ఎంతోమంది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్‌ చేస్తున్నారు. అయితే వెండితెరపై అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాదిలో రియల్ లైఫ్ లో నిజంగా వివాహం చేసుకుంటారని ఎవరు ఊహించరు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. అది నిజంగా జ‌రిగిన సంగట‌న‌.

కృష్ణకు సోదరిగా విజయ నిర్మల... అంగీకరించని ప్రేక్షకులు, అవన్నీ ప్లాపులే! |  Krishna and Vijaya Nirmala acted as siblings - Telugu Filmibeat

అలా అని ఆ ఇద్దరూ సదాసీదా సెలబ్రిటీస్ కాదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తోప్‌ యాక్టర్స్. వాళ్లు మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల. వీరిద్దరిది ప్రేమ వివాహం అన్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. కృష్ణ, విజయనిర్మల కలిసి దాదాపు 50 సినిమాల్లో మెప్పించారు. రెండు సినిమాల్లో అన్న చెల్లెళ్ళుగా కనిపించారు. ఇక 1961లో కృష్ణ.. ఇంద్ర దేవినేని వివాహం చేసుకున్నారు. తర్వాత విజయనిర్మలతో కృష్ణకు పరిచయం ఏర్పడడం.. వీరిద్దరి మధ్యన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

How Krishna Proposed To Vijaya Nirmala?

ఇక అప్పటికే విజయనిర్మలకు కూడా పెళ్ళై భర్త ఉన్నారు. కానీ.. కేవలం కృష్ణ ప్రేమ కోసం భర్తకు విడాకులు ఇచ్చేసింది విజయనిర్మల. అలా ఈ జంట 1969లో తిరుపతిలో వివాహం చేసుకొని ఒకటయ్యారు. ఇక ఈ పెళ్లికి కృష్ణ కుటుంబ సభ్యుల నుంచి ఎవరు అడ్డు కూడా చెప్పలేదు. అయితే అదే ఏడాది ముహూర్త బలం సినిమాలో విజయనిర్మల, కృష్ణ అన్న చెల్లెళ్ళుగా నటించి మెప్పించారు. రియల్ లైఫ్ లో భార్యాభర్తలు గా మారారు. ఇక వీరిద్దరి వివాహ అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం. సీనియర్ నటుడు చంద్రమోహన్.. వీరిద్దరి వివాహానికి పెద్దగా వ్యవహరించాడు. కృష్ణ, విజయనిర్మలతో పాటు.. చంద్రమోహన్ తిరుమలకి వెళ్లి మరీ వీరి పెళ్లి దగ్గరుండి జరిపించాడు.