ఇష్టపడి అది అడగడంలో తప్పేముంది.. కాస్టింగ్ కౌచ్ పై బోల్డ్ బ్యూటీ షాకింగ్ రియాక్షన్..

టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రమ్యశ్రీ. ఈ పేరు చెప్తే టక్కున గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. వ్యాంప్ రోల్స్, బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడి ఫోటో చూస్తే మాత్రం టక్కనే గుర్తుపట్టేస్తారు. తన హాట్ అందాలతో కుర్రాళ‌ను కవించిన ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు మంచి పాపులారిటి ద‌క్కించుకుంది. వాస్తవానికి బోల్డ్ బ్యూటీ అయినా.. హీరోయిన్గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. సరైన అవకాశాలు రాకపోవడంతో.. మెల్లమెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అయిన ఊహించిన సక్సెస్ అమ్మడు దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే బోల్డ్ క్యారెక్టర్స్, బి గ్రేడ్ పాత్రలోనూ నటించింది. ఇక ఈ అమ్మడి అసలు పేరు సుజాత. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత రమ్యశ్రీగా పేరు మార్చుకున్న ఈమె.. తెలుగు అమ్మాయి అయినా మొదట కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Telugu Actress Ramya Sri Sexy Photos

కోలీవుడ్లో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్‌లో గుర్తింపు రాకపోవడంతో.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. కన్నడ, తమిళ , మలయాళ హిందీ భోజపురి ఇలా ఎన్నో భాషల్లో దాదాపు 250 సినిమాల్లో నటించి హాట్ బ్యూటీగా ఇమేజ్ను సొంతం చేసుకుంది. తెలుగులో నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల లాంటి సినిమాలు నటించి మెప్పించింది. ఇక ఎప్పటికప్పుడు ఎక్కువగా బోల్డ్‌ పాత్రలో నటించిన ఈమె.. ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇక నటనలోనే కాదు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లోను ఈమెకు పట్టు ఉంది. ఈమె నటనతో పాటు, డైరెక్షన్‌కు కూడా ఎన్నో అవార్డులను దక్కించుకున్న రమ్యశ్రీ.. అవకాశాలు రాకపోవడం, మరి ఏదైనా కారణము తెలియదు కానీ మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇదిలా ఉంచితే తాజాగా అమ్మడు కాస్టింగ్ కౌచ్ పై చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట‌ సంచలనంగా మారాయి.

ఇష్టపడి అలా అడిగితే తప్పేముంది' కాస్టింగ్ కౌచ్ పై బోల్డ్ బ్యూటీ షాకింగ్  కామెంట్స్ | Actress Ramya Sri sensational comments on casting couch, bold  comments goes viral - Telugu Filmibeat

కాస్టింగ్ కౌచ్ పై ర‌మ్య శ్రీ‌ రియాక్ట్ అవుతూ.. దాదాపు రెండు దశాబ్దాల కెరార్‌లో ఎప్పుడు దాడులను ఎదుర్కోలేదని.. కానీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చూసానంటూ వెల్లడించింది. తనను చాలామంది కమిట్మెంట్ అడిగారని చెప్పుకొచ్చింది. అయినా అలా అడగడంలో తప్పేముంది అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. అడగనిదే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు.. ఇలాంటి విషయాలు కూడా అడిగితేనే కదా అవతలి వ్యక్తి ఎలాంటి వారో మనకి తెలుస్తుంది అంటూ వివరించింది. కొన్నిసార్లు అలాంటి ప్రపోసల్స్ మనకి నచ్చొచ్చు. కానీ డేర్‌ చేయలేము. ఇండస్ట్రీలో కలిసి పని చేస్తాం కాబట్టి ఇలాంటివి సహజం అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఎవరైనా.. రేప్ చేస్తే చెప్పు తీసుకొని కొట్టాలి. లేదా పోలీసులకు కంప్లైంట్ చేయాలి. రేష్‌గా బిహేవ్ చేస్తే వెంటనే పోలీసులకు అప్రోచ్ కావాలి. కానీ.. వాళ్ళు బలవంతం చేయలేదు, ప్రపోజ్ చేశారు. అలా అడగడంలో తప్పేముందంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెటింట దుమారం రేపుతున్నాయి.