చిరంజీవికి చుక్కలు చూపించిన ఆ స్టార్ హీరోయిన్.. అందరూ చూస్తుండగానే అలాంటి పని..!

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అవమానాల తర్వాత కష్టం, పట్టుదలతో స్టార్ హీరోగా ఎదిగి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కేవలం మెగా ఫ్యామిలీకే కాదు.. బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి న‌టులుగా మారాలనుకున్న ఎంతోమందికి అండగా నిలిచాడు. ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మెగాస్టార్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఎంత ఎదిగినా.. ఎంతమంది ప్రశంసలు దక్కించుకున్న.. ఆహ్వాని తలకెక్కించుకోకుండా సింపుల్ సిటీ మైంటైన్ చేస్తూ ఉంటాడు. అలాంటి చిరు తన సినీ కెరీర్‌లో ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోయిన్స్ తోనే నటించి మెప్పించాడు. ఇక చిరు డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Maha Muddu Full Video Song || Jai Chiranjeeva Movie || Chiranjeevi, Bhoomika Chawla, Sameera Reddy

అయితే డ్యాన్స్ విషయంలో అలాంటి చిరంజీవికే ఓ హీరోయిన్ చుక్కలు చూపించిందట. స్వయంగా మెగాస్టార్ ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్స్ సమీరారెడ్డి. చిరంజీవి హీరోగా బ‌చ్చిన‌ జై చిరంజీవ సినిమాలో.. హీరోయిన్గా నటించింది స‌మీరా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌ను సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. మరి ముఖ్యంగా చిరంజీవి డ్యూయల్ షేడ్‌ పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలెట్ . ఇక సినిమాలో మహ ముద్దొచ్చేస్తున్నావోయ్.., కోకో కోడి బాగుంది.. ఈ రెండు పాటలు మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాయి. ఇక ఈ రెండు పాట‌ల‌కు స్టెప్స్ వేసే టైంలో చిరంజీవి.. సమీరా రెడ్డి ఎనర్జీని బ్యాలెన్స్ చేయలేకపోయాడట.

Ko Ko Kodi Baagundi Telugu Full HD Video Song || Jai Chiranjeeva || Jordaar Movies

ముఖ్యంగా మహ ముద్దొచేస్తున్నవోయ్‌ సాంగ్ షూట్ లో అయితే చిరంజీవి కంటే డబల్ స్పీడ్, ఎనర్జీతో సమీరా స్టెప్స్ వేసి మెస్మరైజ్ చేసిందట. ఇప్పటివరకు చిరంజీవి ఏ సినిమాలో కూడా స్టెప్స్ విషయంలో అంతగా తడబడలేదని.. కష్టపడలేదని.. సమీరా రెడ్డి చూసిన వెంటనే స్టెప్స్ పట్టేసి.. చిరంజీవి కంటే ముందుగా వేసేసేదని వివ‌రంచారు. తాను కూడా సమీరా రెడ్డికి గట్టి కాంపిటీషన్ ఇవ్వాలని తెగ ట్రై చేసేవాడని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇక తన వల్ల కాదంటూ చెమటలతో కుర్చీలో కూర్చుని పోయిన సందర్భం కూడా ఉందట. అలాంటి హార్డ్‌ స్టెప్స్‌ని కూడా యమా ఫాస్టుగా.. చిరంజీవిని మెప్పించే విధంగా సమీరా రెడ్డి చేసి ఆకట్టుకుందట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. సమీరా రెడ్డి ఇంత టాలెంటెడా అంటూ.. అస్సలు నమ్మలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.