నందమూరి నటసింహమ బాలకృష్ణ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా చూస్తున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నేడు దసరా సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబోలో వరుసగా మూడు సినిమాలు వచ్చి మూడు ఒకదానిని మించిన బ్లాక్ బస్టర్‌గా మరొకటి నిలిచాయి. అఖండ, లెజెండ్, సింహ ఇలా మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా బాలయ్య – బోయపాటి కాంబోలో అఖండ 2 సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఇటీవల బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య హీరోగా BB4 వర్కింగ్ టైటిల్తో 14 వీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. పేరు నాలుగో సినిమాను ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇక ఈ పోస్టర్‌తో పాటు ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ని కూడా షేర్ చేసుకున్నారు మేకర్స్. అక్టోబర్ 16న సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సినిమా షూట్ మొదలెడతామని హింట్ ఇచ్చే విధంగా.. పోస్టర్ BB4 వర్కింగ్ టైటిల్‌తో అమ్మవారి ఫోటోను హైలైట్ చేశారు.
దీంతో కచ్చితంగా ఈ సినిమా అఖండ 2నే అంటూ అంతా ఫిక్స్ అయ్యిపోయారు. ఈ పోస్టర్ చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. బోయపాటి ఈసారి తమ ఫేవరెట్ హీరోను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నాడు అంటూ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అమ్మవారి ఫోటోతో.. BB4 రన్నింగ్ టైటిల్ను అనౌన్స్ చేయడంతో మరింత ఎక్సైట్మెంట్ అభిమానుల్లో పెరిగింది. ఇక కాస్టింగ్ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. మొత్తానికి విజయదశమి సెలబ్రేషన్స్ లో బాలయ్య ఫ్యాన్స్ కు ఒక మంచి అప్డేట్ను అందించాడు బోయపాటి. ఇక ప్రస్తుతం బాలయ్య – బాబి డైరెక్షన్లో ఎన్బికె 109 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.