టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఆర్ఆర్ఆర్. 2022లో వచ్చిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో గ్లోబల్ అవార్డులను దక్కించుకొని రికార్డ్ సృష్టించింది. తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచ దేశాలు అన్నింటికి తెలిసేలా ఆర్ఆర్ఆర్ ఓ వెలుగు వెలిగింది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో మల్లీ అనే పాత్రలో మెరిసిన చిన్నపిల్ల అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మడు సినిమాకు కీలకంగా మారింది.
తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ పై ఫోటోలో చూస్తున్న అమ్మడు ఆ మల్లీ తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. అయితే మల్లీ తల్లిగా నటించినా ఆ నటి ఎవరో.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే.. మీరు నోరెళ్ళబెడతారు. గోండు జాతి అమ్మాయిగా.. బ్రిటిష్ రాణి తన కూతుర్ని తీసుకు వెళ్తుంటే బిడ్డ కోసం ఆరాటపడుతూ.. ఆ కారు వెంట పరిగెత్తి.. బిడ్డ తిరిగి తన ఒడికి చేరినప్పుడు సంబరపడిన తల్లి పాత్రతో ఆడియన్స్‌కు కన్నీరు పెట్టించిన ఆ నటి పేరు అహ్మరిన్ అంజుమ్. ఆమె ఓ బాలీవుడ్ నటి.
షార్ట్ ఫిలిమ్స్, కమర్షియల్ యాడ్స్, టెలివిజన్ షోస్, పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అలాగే ఆమె స్టేజ్ ఆర్టిస్ట్ గాను ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, బెంగాలీ, తెలుగు లాంటి ఎన్నో భాషల్లో మాట్లాడగలదు. బహుముఖ ప్రజ్ఞాశాలి. 2022లో బ్రిటిష్ సౌత్ ఏషియన్ యాక్టర్ డాని సురాను వివాహమాడిన ఈ అమ్మడు.. నటి మాత్రమే కాదు నటనలో గుర్తింపు సాధించాలనుకునే వారికి తన భర్తతో కలిసి యాక్టింగ్ క్లాస్‌లను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. చూడడానికి చిన్నపిల్లలా కనిపించే ఈ అమ్మాయికి ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉందా.. ఇన్ని భాషల్లో ఎలా మాట్లాడగలుగుతుంది.. అంటూ నోరెళ్ళబెడుతున్నారు నెటిజన్స్.