వాళ్లని ఫాలో అయితే భాగ్యశ్రీ కెరీర్ డేంజర్ లో పడినట్టే.. మరి ఈ అమ్మడు ఏం చేస్తుందో..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది కొత్తవారు ఎప్పటికప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే అతి తక్కువ టైంలో అద్భుతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటారు. అయితే క్రేజ్ వచ్చిన బ్యూటీలు వరుసగా సినిమా అవకాశాలు రావడం కామన్. ఇక అలా సినిమా అవకాశాలు రావడం మాత్రమే కాదు.. వారు నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తే ఇక కెరీర్ సూపర్ క్రేజ్ తో ముందుకు దూసుకుపోతుంది. అలా అతి త‌క్కువ‌ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు.

Tollywood Buzz: అయ్యో పాపం.. కృతి శెట్టి కెరీర్‌కు స్పీడు బ్రేకర్‌లా మారిన ఆ బ్యూటీ - Telugu News | Tollywood buzz: Sreeleela overtakes Krithi Shetty. Check interesting details | TV9 Telugu

అయితే కొంతమంది మాత్రం కంటెంట్ గురించి ఆలోచించకుండా.. వచ్చిన సినిమాలన్నింటినీ ఓకే చేసేస్తూ నటించి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి క్రమంలో వారి ఇమేజ్ మరింతగా తగ్గుతూ ఉంటుంది. ఇకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉంది భాగ్యశ్రీ బోర్సే. ఈ బ్యూటీ మిస్టర్ బ‌చ్చన్ సినిమాతో తెలుగు తెర‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ అమ్మడుకు మరిన్ని సినిమాల్లో అవకాశాలు దక్కాయి.

Bhagyashri Borse: రవితేజ సరసన భాగ్యశ్రీ | bhagyashri-borse -will-play-lead-in-ravi-teja-new-movie

ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం.. కృతి శెట్టి, శ్రీలీల ఇద్దరు ముద్దుగుమ్మలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరికి కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు క్యూ కట్టడంతో.. క్రేజీ హీరోయిన్ గా మారిపోయారు. కానీ వీరు నటించిన సినిమాల్లో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపులుగా నిలవడంతో వీరి క్రేజ్ కాస్త డమాలైంది. ఇక భాగ్యశ్రీ బోర్సే కూడా వచ్చిన ప్రతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అపజయాలు అందుకుంటుందా.. లేదా.. కంటెంట్ ఉన్న కథలను ఆచితూచి ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్గా మారిపోతుందా.. వేచి చూడాలి. ఇక అమ్మడి ఫ్యూచర్ స్టేటస్ ఆమె తీసుకోబోయే నిర్ణయం పైన ఆధారపడి ఉంది. మరి ఈ అమ్మడు ఏం చేస్తుందో..? వేచి చూడాలి.