టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా కొరటాల శివ ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో సినిమాలకు కథలు అందించిన ఈయన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మిర్చితో డైరెక్టర్ గా మారాడు. ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న కొరటాల దర్శకుడుగా తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక కొరటాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ.. ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ.. కొన్ని నెల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఆ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఆ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకు మిక్స్డ్ టాక్ వచ్చిందని.. అయితే దానికి మరెవరో కారణం కాదు.. తారక్ అభిమానులే అంటూ వివరించాడు. ఆ సినిమా ఎక్కడో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చలేదని చెప్పుకొచ్చిన ఆయన.. తర్వాత సినిమా పికప్ అయ్యి బాగా ప్రేక్షకులను ఆకట్టుకుందంటూ వివరించాడు. పెద్ద సక్సెస్ అందుకుందంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం కొరటాల దేవర సినిమా రూపొందిస్తున్న క్రమంలో జనతా గ్యారేజ్ కు జరిగిన సంఘటన.. ఆ తప్పులు దేవర విషయంలో జరగకుండా చూసుకుంటానని.. మూవీ రిలీజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి అభిమానులకు సినిమా విపరీతంగా నచ్చుతుందని వివరించాడు.
ఇకపోతే దేవర సినిమా మొత్తం రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే భారీ అంచనాలతో నెలకొంటున్న ఈ సినిమాలో దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటించడంతో.. ఈ అమ్మడి నటన ఎలా ఉంటుందో చూడాలని టాలీవుడ్ ప్రేక్షకల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుద్ధ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌తో కలిసినా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామంటూ తారక్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కొరటాల ఈ సినిమాతో అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా.. లేదా.. సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో.. వేచి చూడాలి.