అదితి రావు హైదారి ప్రేమ ముచ్చట్లు విన్నారా.. పెళ్లి అక్కడే నట..?

స్టార్ట్ బ్యూటీ అదితి రావు హైదారి – సిద్ధార్థ్ ప్రేమాయణం గురించి దాదాపు జౌత్ ఆడియ‌న్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక వీరిద్దరూ కొంత‌కాలం క్రితం ఎవరికి తెలియకుండా చాలా ప్రైవేట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీక్రెట్ గా వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన సిద్ధార్థ.. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు వ్యత్యాసం ఉంటుందని.. మా ఎంగేజ్మెంట్ కు ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే దానిని సీక్రెట్ ఫంక్షన్గా అనుకుంటున్నారని.. నిజం చెప్పాలంటే మాది ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ అంటూ చెప్పుకొచ్చింది.

Looking at Siddharth and Aditi Rao Hydari's adorable love story

ఇదేమీ షూటింగ్ డేట్ కాదు.. నేను నిర్ణయించడానికి.. లైఫ్ టైం డేట్. పెద్దలు నిర్ణయం ప్రకారం ఇది జరిగిపోయింది. వాళ్ళు ఎప్పుడు ఏం జరగాలనుకుంటే.. ఆ టైంలోనే అది జరుగుతుంది అంటూ సిద్ధార్థ వెల్లడించాడు. ఇక తాజాగా అదితి మొదటిసారి సిద్ధార్థతో ప్రేమాయణం గురించి.. వారిద్దరి ప్రేమ‌, పెళ్లి, వెన్యూ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అమ్మడు చెప్పిన ఆ విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి మాట్లాడుతూ.. సిద్ధార్థతో ఎంగేజ్మెంట్‌ జరిగిన దేవాలయంలోనే పెళ్ళి కూడా చేసుకుంటామంటూ వివరించింది.

మహాసముద్రం షూట్‌ టైం లో సిద్ధార్థ తో పరిచయం ఏర్పడిందని.. కొంతకాలానికి ఇద్దరం మంచి స్నేహితులమయ్యమని.. మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం.. ఎలాంటి విషయాలైనా ఆమెతోనే షేర్ చేసుకుంటా. హైదరాబాద్‌లో ఆమె ఓ స్కూల్ స్టార్ట్ చేసింది. అది నాకు ఎంతో స్పెషల్.. నా చిన్నప్పటి రోజులు అక్కడే ఎక్కువగా గడిచాయి. కొన్నేళ్ళ క్రితం ఆమె చనిపోయింది. ఆ విషయం సిద్ధార్థ కు ముందే తెలుసు. కొద్ది రోజుల క్రితం ఆయన నా దగ్గరకు వచ్చి ఆ స్కూలుకు తీసుకువెళ్ళమని అడిగారు.

Aditi Rao Hydari & Siddharth tied the knot in a private ceremony held at a temple in Telangana? ...

మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్ళాం. మోకాళ్ళపై కూర్చుని అతను నాకు ప్రపోజ్ చేశారు. ఆమె ఆశీస్సుల కోసమే తను అక్కడ ప్రపోజ్ చేసినట్లు వివరించాడు అంటూ అతిథి రావు చెప్పుకొచ్చింది. అతని ప్రేమను వ్యక్తపరిచిన తీరు నాకు చాలా నచ్చిందని వెల్లడించింది. ఇక తన పెళ్లి వేదిక గురించి మాట్లాడుతూ వనపర్తి జిల్లా శ్రీరంగాపురం లోని రంగనాథ స్వామి ఆలయం మా కుటుంబానికి ఎంతో స్పెషల్.. మా ఎంగేజ్మెంట్ కూడా అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే చేసుకోబోతున్నాం అంటూ వివరించింది. పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత మేమే అనౌన్స్ చేస్తాం అంటూ వివరించింది.