టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణుడు పాత్ర చెప్పగానే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు. మాయాబజార్లో కృష్ణుడిగా ఎన్టీఆర్ ఎలా ఒదిగిపోయి నటించారో తెలిసిందే. ఆయన నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ముఖంలో హావభావాలను సమపాళ్లలో పండించి ఎన్టీఆర్ అంటే ఓ రాముడు, ఎన్టీఆర్ అంటే ఓ కృష్ణుడు అనేంతల పౌరాణిక పాత్రలకు ప్రసిద్ధి చెందడు. ఇక తారక రామారావు ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు 100% న్యాయం చేసేవారు. అందుకే ఆయన తెలుగు ప్రజలలో నందమూరి నటసార్వభౌమ, విశ్వవిఖ్యాతగా ముద్ర వేసుకున్నారు. రాముడిగా, కృష్ణుడు గానే కాదు భీముడు, కర్ణుడు, దుర్యోధనుడు ఇలా పౌరాణిక పాత్రల్లో ఆయన తప్ప మరే హీరోని ఊహించుకోలేనంతగా జీవించాడు. అలాంటి తారక రామారావు గారు మొదట కృష్ణుడి వేషం వేయడానికి ఎంతో భయపడ్డాడట. ఆయనతో పాటు పనిచేసిన సీనియర్స్ ఈ ఇషయాని చెప్తూ ఉంటారు.
అయితే దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. ఒకప్పటి సినిమాల్లో కొన్ని విషయాలు ఎప్పటికీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అందులోనూ క్లాసిక్స్ అంటే మాయాబజార్ లాంటి సినిమాల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్న తక్కువే.. ఇక మాయాబజార్ అంటే కేవలం ఎన్టీఆర్ నటించిన కృష్ణుడి పాత్ర మాత్రమే గుర్తుకువస్తుంది. కృష్ణుడే ఈ సినిమా కోసం భువికి దిగి వచ్చాడా అనంతల ఆయన జీవించాడు. అయితే మాయాబజార్ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ మరో రెండు సినిమాల్లో కృష్ణుడిగా కనిపించాడు. ఇద్దరు పెళ్ళాలు, సొంత ఊరు అనే సినిమాల్లో ఆయన కొన్ని సీక్వెన్స్ లలో కృష్ణుడిగా మెరిసారు. ఈ సినిమాల్లో కృష్ణుడిగా ఎన్టీఆర్ కనిపించగానే.. జనం గోలగోల చేసేవారట. ఈ విషయం ఎన్టీఆర్ దాకా రావడంతో ఆయన కాస్త ఆలోచనలో పడ్డారట.
పాత్రధారణ బాగోలేక, మేకప్ బాగోలేక, మరేదో కారణంతోనా ఎందుకు ప్రేక్షకులు అంతలా గోల చేశారో అర్థం కాలేదట. రెండు సినిమాల్లోనూ నెగటివ్ రియాక్షన్ రావడంతో ఎన్టీఆర్ వచ్చి ఇదే విషయం మాయాబజార్ ప్రొడ్యూసర్లకు చెప్పారట. చక్రపాణి, నాగిరెడ్డి గార్ల దగ్గర ఆయన విషయాన్ని వర్ణించాడట. నేను కృష్ణుడిగా కనిపిస్తే సినిమాకు మైనస్ అవుతుందేమో అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. దీంతో వాళ్లు సరే ఓ పని చేద్దాం. ముందు కొన్ని లుక్స్ టెస్ట్ చేసి.. ఓకే అనుకుంటే మీరే కొనసాగుదురని ధైర్యం చెప్పారట. అలా ఎన్నో టెస్టులు, తర్జన బర్జనల తర్వాత ఒక్కసారిగా ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్ తో సెట్స్‌లోకి వచ్చేయడం.. పర్ఫెక్ట్ గా కృష్ణుడిలాగే ఉన్నావని అందరూ మెచ్చుకోవడంతో.. ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చి ఆ సినిమాలో నటించారు.
ఇక ఎన్టీఆర్ ఈ సినిమాకు పడిన కష్టం వృధాగా పోలేదు. మాయాబజార్లో ఎన్టీఆర్ కృష్ణుడిగా ఎంతల క్లిక్ అయ్యారంటే.. ఇప్పటికీ కృష్ణుడి పాత్ర పేరు ఎత్తగానే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఎన్నో క్యాలెండర్స్ లో కృష్ణుడిగా ఎన్టీఆర్ నే ప్రింట్ చేశారు. ఇక ఒకప్పుడు కృష్ణుడిగా ఉన్న ఎన్టీఆర్ ఫోటోలనే పూజ గదిలో పెట్టుకుని పూజలు కూడా చేసేవారు. కృష్ణుడిగా చేయాలంటే కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యం.. ఇంకా ఏ స్టార్ హీరో చేసిన ఆ దైవత్వం కనపడదు అనేంతలా ఎన్టీఆర్ ఆ పాత్రను పోషించారు. అప్పటి నుంచి దాదాపు 25 దశాబ్దాలు ఎన్నో సినిమాల్లో పదిసార్లు కంటే ఎక్కువగా కృష్ణుడు పాత్రలో కనిపించి మెప్పించారు అన్నగారు.