రాజ్ తరుణ్ – లావణ్యలకు పాప ఉందా.. సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు కదరా సామి..!

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న వార్తలో రాజ్ తరుణ్ – లావణ్య లవ్ ఎఫైర్ ఒకటి. వీరిద్దరూ ప్రేమించుకుని వివాహం చేస్తున్నారంటూ.. ఇప్పుడు వేరే హీరోయిన్ ఉచ్చులో పడి నన్ను వదించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య రచ్చ చేసిన సంగతి తెలిసిందే. రోజురోజుకు ఈ వివాదంలో ఓ కొత్త కథను మీడియా ముందుకు తీసుకొస్తూ రచ్చ రచ్చ చేస్తుంది లావణ్య. ఈ క్రమంలో రాజ్ తరుణ్ మీడియాకు కనిపించకుండా వెళ్ళిపోయారు.

అయితే జరిగిన సంఘటనలు మొత్తం చూసిన నటిజన్స్ అంతా తప్పు లావణ్య‌దే.. కేవలం రాజ్ తరుణ్ లాంటి స్టార్ సెలబ్రెటీ దగ్గర డబ్బు గుంజుకునే ప్రయత్నం కోసమే ఇలా రచ్చ చేస్తుందని.. నాటకాలు ఆడుతూ ఓ సెలబ్రెటీ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పురుషోత్తముడు నేడు రిలీజ్ అవుతుంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా రాజ్ తరుణ్ కనిపించలేదు. ఇదిలా ఉంటే రీసెంట్గా రాజ్‌తరుణ్‌కి సంబంధించిన మరో లేటెస్ట్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది. రాజ్ తరుణ్, లావణ్య జంటకు మూడేళ్ల పాప కూడా ఉందని.. త్వరలో లావణ్య వాడబోయే అస్త్రం తనేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై ఇండస్ట్రీకి చెందిన ఓ సీనియర్ నేత రియాక్ట్ అయ్యారు. ఇదంతా కేవలం లావణ్య చేస్తున్న నాటకం. మస్తాన్ భాష అనే వ్యక్తితో లావణ్య ప్రేమాయణం నడపడంలో తప్పులేదు.. కానీ రాజ్ తరుణ్.. మాల్వి మలహోత్రతో ఉండకూడదా అంటూ ప్రశ్నించాడు. మాల్వి తో రాజ్‌తరుణ్ ఉండడం లావణ్య జీర్ణించుకోలేకపోయిందని.. అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అంటూ మండిపడ్డాడు. ఇక లావణ్య తరుపున ఈ కేస్ జనసేన మాజీ నాయకుడు ప్రస్తుత హైకోర్ట్‌ లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకరా వాదించడంతో ఈ వివాదంలో మరింత హీట్ పెరిగింది. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ ముసుగులో తిరుగుతున్నాడని.. పారిపోయి దాక్కుంటున్నాడని.. అతను ప్రస్తుతం మల్హోత్రాతోనే ఉంటాడు అంటూ కామెంట్స్ చేశారు.