జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో స్టూడెంట్ నెంబర్1, ఆది, సింహాద్రి ఇలా వరుస బ్లాక్ పాస్టర్ సక్సెస్‌లతో దోసుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని.. నిర్మాతలు అంతా క్యూ కట్టేవారు. ఎన్టీఆర్ సినిమాలు అప్పట్లో ఆ రేంజ్ క్లాసుల వర్షం కురిపించేవి. ఈ హీరోతో సినిమాలు చేస్తే ప్రాఫిట్ కచ్చితంగా వస్తుందని ఉద్దేశంతో.. నిర్మాతలు పోటీపడి మరి ఎన్టీఆర్ సినిమాకు బడ్జెట్ కేటాయించేవారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో ఓ ప్రొడ్యూసర్ సినిమాను తీసి బాగా నష్టపోయాడట. హుస్సేన్ సాగర్ లో కూడా దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడట. అప్పట్లో ఈ వార్త ఓ సంచలనం. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు.. ఆ సినిమా ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం.
ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు.. చెంగాల వెంకట్రావు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నరసింహుడు సినిమాకు ఈయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. బి. గోపాల్ డైరెక్షన్లో అమేషా పటేల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. చెంగల వెంకటరావు అప్పటికే సమరసింహారెడ్డి సక్సెస్ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. బి. గోపాల్, ఎన్టీఆర్ కూడా అప్పటికే స్టార్డం సంపాదించుకొని వరుస సక్సస్‌లతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు అయినా కేటాయించాడట. అంతేకాదు రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 200 కేంద్రాల్లో వంద రోజులు అంటూ పోస్టర్లు కూడా ప్రింట్ చేయించాడట. అంత నమ్మకంతో బి.గోపాల్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే సినిమా హిట్ అవుతుందని అందరు భావించినా.. రిలీజ్ అయిన ఫస్ట్ డే, ఫస్ట్ షో తోనే నెగటివ్ టాక్ రావడంతో డిజాస్టర్ గా నిలిచింది.
అంతే కాదు మరోవైపు ఉత్తరాంధ్ర సినిమా రిలీజ్‌కు కూడా బ్రేకులు పడ్డాయి. డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులు చెల్లించలేదని రిలీజ్‌ను ఆపేశారు. ఈ క్రమంలో పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోవడంతో.. ఆర్థికంగా అప్పులో కూరుకుపోయిన వెంకట్రావు.. హుస్సేన్ సాగర్‌లో దూకి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. పోలీసులు వెంటనే అతని కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన సమయంలో వెంకట్రావు పాకాయరావు పేట నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆయనకు అంత పెద్ద సంఘటన చోటు చేసుకున్న టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు గాని.. తన సినిమా వల్ల నష్టం కలిగినా.. ఎన్టీఆర్ కానీ ఎలాంటి సహాయం అందించకపోగా.. దానిపై అసలు నోరైనా మెదపలేదట. దీంతో ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు కాస్త బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయ్యిందట.