ఆ స్టార్ హీరో కారణంగా నా జీవితం నాశనమైంది.. టాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అర్చ‌న‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నేను సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది. తర్వాత వారుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ కొంతకాలం బిజీ బిజీగా గడిపింది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్గా అమ్మడు దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ ఊహించిన రేంజులో సక్సెస్ దక్కలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ రోల్స్‌లో కూడా పలు సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. దీంతో అమ్మడి క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి క్రమంలో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గా అవకాశాన్ని దక్కించుకున్న అర్చన.. తన ఆట‌తీరుతో అందరినీ ఆకట్టుకుంది. అయినా ఆ ఇమేజ్ కేవలం బిగ్‌బాస్ హౌస్ వరకు మాత్రమే ఉపయోగపడింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మడికి ఊహించినట్లు ఏమీ అవకాశాలు ద‌క్క‌లేదు.

అప్పుడప్పుడు చిన్న చిన్న అవకాశాలను దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపై ప‌లు షోల‌కు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇక సినిమా అవకాశాలు కూడా అంతంతమాత్రంగా ఉండడంతో.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి లైఫ్‌లో సెటిల్ కావాలని భావించిన అర్చన.. 2019లో ప్రియుడు జగదీష్‌ను వివాహం చేసుకుంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అమ్మడు మాట్లాడుతూ క్యాస్టింగ్ కోచ్ పై షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది. ఓ సినిమాలో తన నటనకు అవార్డ్‌ వచ్చిందని.. అయితే ఆ అవార్డ్ డిస్ట్రిబ్యూషన్‌కు స్టార్ హీరో గెస్ట్ గా వచ్చాడని.. తన పేరు పిలిచినప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్లానంటే చెప్పుకొచ్చింది.

కాగా సదరు హీరో నేను ఆ అమ్మాయికి అవార్డు ఇవ్వనని తెల్చి చెప్పేశాడ‌ని వెంట‌నే స్టేజ్‌పై నుంచి దిగిపోయారని అర్చన వివరించింది. ఇక అతని ప్లేస్ లో మరొక వ్యక్తి వచ్చి ఆ అవార్డు ఇచ్చారని చెప్పుకొచ్చింది. ఇక మళ‌యాళ‌ ఇండస్ట్రీలో అవ‌కాశం దక్కించుకుని ఓ సినిమాలో నటిస్తున్న టైం లో.. ఆ మూవీ హీరో తనకు తరచు అలాంటి మెసేజ్లు పెట్టేవాడని.. దానికి రిప్లై ఇవ్వకపోవడంతో.. హర్ట్ అయిన అతను నన్ను సినిమాలో నుంచి తప్పించాడని వెల్లడించింది. అతని కారణంగానే మంచి సినిమా అవకాశాన్ని పోగొట్టుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక తనకు అలాంటి మెసేజ్లు పెట్టిన స్టార్ హీరో ఎవరనేది మాత్రం రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో అర్చన కెరీర్ నాశనం అవ్వడానికి.. ఆమెకు వచ్చిన సినిమా ఆఫర్ చేజారి పోవడానికి కారణం ఒక స్టార్ హీరోనా.. తనే ఆమె కెరీర్ నాశనం చేశాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.