సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. సినిమాల కంటే కాంట్రవర్సీ లతో పాపులర్..!

పైన కనిపిస్తున్న ఈ ఫోటోలు సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతో పాపులర్ అయిన ఈ కుర్రాడు కూడా నందమూరి వారసుడే. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అప్పుడెప్పుడో 21 ఏళ్ల కిందట సినిమా చేయగా.. మళ్లీ ఇటీవల కాలంలో మరో సినిమాకు తాను హీరోగా నటించాడు. కాగా ఈ సినిమా ఒక్క రూపాయి కూడా కలెక్షన్లను రాబట్టలేక డీలా పడింది. దీంతో నటుడిగా ఈయనకు గుర్తింపు రాలేదు. ఈపాటికి అతను ఎవరో గెస్ చేసి ఉంటారు. ఎస్ మీరు అనుకున్నది కరెక్ట్. ఈయ‌న‌ నందమూరి హీరో చైతన్య కృష్ణ.

కృష్ణ గత ఏడాది బ్రీత్ సినిమాతో థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఒక్క రూపాయి కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు.. చైతన్య కృష్ణ సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. 2003లో జగపతిబాబు హీరోగా వచ్చిన ధ‌మ్ సినిమాలో ఒకీలక పాత్రలో కనిపించాడు. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ నటనపై ఆసక్తి కనబరిచి బ్రీత్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మళ్లీ సినిమాల వైపు వెళ్లలేదు.

కాగా ఈ సినిమా రిలీజ్ టైం లో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్న చైతన్య కృష్ణ ఎప్పటికప్పుడు ట్రోలర్స్ కు తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు. అలాగే రాజకీయ విషయాలలోనూ యాక్టివ్ గా ఉంటూ బాలయ్య చంద్రబాబులను దూషించే వారిపై మండిపడుతూ ఉంటాడు. ఇలా సినిమాల్లో కంటే చైతన్య కృష్ణ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటూ హీరో కంటే కాంట్రవర్షల్ నటుడుగా ఎక్కువ పాపులారిటీ పొందాడు. ప్రస్తుతం రాజకీయాల్లో రాణించాలని తనదైన మార్క్ క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నాడు ఈ హీరో.