స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతూ ఉంటుంది. ఇక అదే పాన్ ఇండియా హీరోకి సంబంధించిన విషయం అయితే సెకండ్స్ లోనే ప్రపంచవ్యాప్తంగా పాకిపోతుంది . ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నాయి . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
అదేవిధంగా ఆ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అయ్యాడు నాగ్ అశ్వీన్. అయితే ఈ సినిమా లో ప్రభాస్ పేరుని “శ్రీ ప్రభాస్” అంటూ చూపిస్తారు . ఇప్పటివరకు ప్రభాస్ ఎప్పుడు కూడా తన సినిమాల విషయంలో ఇలా చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఆ క్రేజీ ఛాన్స్ కల్కి సినిమాకే ఇచ్చారు . అయితే ప్రభాస్ తన పేరు ఎందుకు మార్చుకున్నాడు..? ప్రభాస్ పేరు మార్చుకోవడానికి గల కారణం ఏంటి..? అనే విషయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి .
అయితే ప్రభాస్ పేరు మార్చుకోవడానికి కారణం తన అమ్మగారు అంటూ తెలుస్తుంది . ఆయన జాతకంలో ఉన్న దోషం కారణంగానే ఆయనకు సరైన హిట్స్ పడడం లేదు అని అదేవిధంగా పెళ్లి కావడం లేదు అని ..ఇలా పేరు మార్చుకుంటే ఆయనకు కలిసి వస్తుంది అని వాళ్ళ ఫ్యామిలీ పూజారి చెప్పడంతోనే ఈ విధంగా చేశారట . అయితే నమ్మకం లేకపోయినా సరే తల్లి మాట కోసం ప్రభాస్ తన పేరు మార్చుకున్నట్లు తెలుస్తుంది..!!