ఆస్తి వివాదాల్లో రాంచరణ్, ఉపాసన.. చరణ్ కి పెద్ద షాక్ ఇచ్చిన మెగా కోడలు.. ఏం జరిగిందంటే..?!

చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. మెగా వారసుడుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వైవిధ్యమైన కథలను నేర్చుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన స్టేటస్ ను దక్కించుకొని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమా కంప్లీట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఇక బుచ్చిబాబుతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్‌ పైకి రానుంది. కాగా చరణ్ 2012లో ఉపాసన కామినేని ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గ‌తేడాదే ఈ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు త‌న‌కు క్లింకార అని నామ‌కరణం చేసి ప్రిన్సెస్‌లా ఆమెను పెంచుతున్నారు.

ఇటీవల తమ గారాల బట్టి లింకార పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి గ్రాండ్ లెవెల్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఉపాసన, రాంచరణ్ దంపతులు. అయితే తాజాగా చెర్రీ, ఉపాసన ఆస్తులకు సంబంధించిన ఓ క్రేజి రూమ‌ర్ వైరల్ గా మారింది. అదేంటంటే ఈ దంపతులు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న క్రమంలో ఎవరి ఆస్తి ఎక్కువ అనే విషయంలో చిన్న వివాదం తలెత్తిందని సమాచారం. ఇక గతంలో వీరిద్దరూ కలిసి ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. తమలో ఇద్దరి పేరు మీద సమానంగా కాకుండా ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటే వాళ్ళు ఆ ఎక్స్ట్రా ప్రాపర్టీని తమ గారాలు పట్టి క్లింకారా పేరు మీద సపరేట్ ఎకౌంట్ తీసి అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలని ఒప్పందం కుదిర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే రామ్ చరణ్, ఉపాసన దంపతులు మొత్తం పాన్ ఇండియా లెవెల్ లోనే రిచెస్ట్ సెలబ్రిటీ జంటల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ కపుల్ పేరు మీద ఇద్దరికీ కలిపి రూ.2130 కోట్ల ఆస్తి ఉండగా.. కేవలం ఉపాసనకే రూ.1130 కోట్ల వరకు ఆస్తి ఉందట. అంటే రామ్ చరణ్ కంటే ఉపాసనకే దాదాపు రూ.130 కోట్ల ఆస్తి ఎక్కువగా ఉంది. ఇద్దరికీ ఈక్వల్ గా ఆస్తి ఉండాలని ఉద్దేశంతోనే అదన‌పు ఆస్తి తన ముద్దుల కూతురు క్లింకార పేరుమీద ట్రాన్స్ఫర్ చేయించాలనుకున్నా.. వీరిద్దరి మధ్యన గొడవ కారణంగా ఉపాసన ఇంకా ఆస్తిని తన పేరు మీదే ఉంచుకొని.. ఆ ఆస్తి నా పేరు పై ఉన్నా.. క్లింకార పేరు పై ఉన్నా ఒకటే అంటూ సరదాగా చెర్రీ పై దబాయిస్తుందట.. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవడంతో వదినమ్మ అన్న కంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని ఇలా చేస్తున్నారంటూ.. వామ్మో అన్న‌య్య‌కు మ‌రీ ఇంతా షాక్ ఇచ్చావేంటి వ‌దిన‌మ్మంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది.